OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే-sammelanam ott release date telugu romantic comedy triangle love story to stream on etv win from 20th february ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu
Published Feb 07, 2025 07:48 PM IST

OTT Telugu Romantic Comedy: ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ వస్తోంది. సమ్మేళనం పేరుతో వస్తున్న ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని ఈటీవీ విన్ శుక్రవారం (ఫిబ్రవరి 7) అనౌన్స్ చేసింది. అయితే ముందు చెప్పిన తేదీ కంటే వారం ఆలస్యంగా ఈ మూవీ రాబోతోంది.

ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలోకి మరో తెలుగు ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Romantic Comedy: ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్ ఓటీటీ సమ్మేళనం పేరుతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ ఆ ఓటీటీ ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మరి ఈ మూవీ ఏంటి? ఇతర స్ట్రీమింగ్ వివరాలను ఒకసారి చూద్దాం.

సమ్మేళనం ఓటీటీ రిలీజ్ డేట్

ఈటీవీ విన్ ప్రేక్షకులకు అందిస్తున్న మరో ఒరిజినల్ మూవీ సమ్మేళనం (Sammelanam). ఈ సినిమా ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని శుక్రవారం (ఫిబ్రవరి 7) ఆ ఓటీటీ వెల్లడించింది. "సమ్మేళనం.. ప్రేమ, నవ్వులు, క్రేజీ లవ్ ట్రయాంగిల్. గందరగోళం మొదలైంది.

ఫిబ్రవరి 20 నుంచి ఈటీవీ విన్ లో" అనే క్యాప్షన్ తో ఈ సమ్మేళనం మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. కొత్త నటీనటులతో రూపొందిన సినిమాగా పోస్టర్ చూస్తే తెలుస్తోంది. నిజానికి ఈటీవీ విన్ తన ఫిబ్రవరి రిలీజెస్ లో ఈ సమ్మేళనం గురించి కూడా వెల్లడించింది. అయితే ఫిబ్రవరి 13నే రానున్నట్లు అప్పట్లో చెప్పింది. కానీ తాజాగా ఫిబ్రవరి 20న వస్తున్నట్లు తాజాగా అనౌన్స్ చేసింది.

ఈటీవీ విన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేస్తూ పెట్టిన క్యాప్షన్ చూస్తుంటే ఇదో ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్ మూవీలాగా కనిపిస్తోంది. పోస్టర్లో ఐదుగురు ప్రధాన పాత్రధారులు ఉన్నారు. మూవీ కథంతా వీళ్లు చుట్టూనే తిరిగేలా కనిపిస్తోంది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు, ట్రైలర్ లాంటివి రానున్న రోజుల్లో రిలీజ్ చేయనున్నారు.

ఈటీవీ విన్ రిలీజెస్

ఈటీవీ విన్ ఫిబ్రవరి నెలలో తమ ప్లాట్‌ఫామ్ పైకి రాబోతున్న సినిమాల జాబితాను ఇప్పటికే వెల్లడించింది. పాత, కొత్త కలిపి ఏకంగా 40 మూవీస్ ఈ నెలలో ఆ ఓటీటీలోకి రానుండటం విశేషం. వాటి పూర్తి జాబితాను వెల్లడిస్తూ ఎక్స్ అకౌంట్లో గతంలోనే ట్వీట్ చేసింది. వాటిలో ఈ సమ్మేళనం అనే ఒరిజినల్ కూడా ఒకటి. ఈ సినిమాల వివరాలను గతంలో చేసిన ట్వీట్ లో తేదీల వారీగా వెల్లడించింది.

వీటిలో ఒకప్పటి బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన అలా మొదలైంది, అతడు, ఫిదా, ఖాకీ, మోసగాళ్లకు మోసగాడు, సింహా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు, స్టాలిన్ లాంటి సినిమాలు ఉన్నాయి. ఇక ఒరిజినల్స్ విషయానికి వస్తే సమ్మేళనంతోపాటు కౌసల్య సుప్రజ రామా అనే మరో మూవీ కూడా రాబోతోంది. ఫిబ్రవరి 6నే 16 సినిమాలు అడుగు పెట్టగా.. 20వ తేదీ నాడు మరో 15, 28న 7 సినిమాలు రాబోతున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం