Samantha Yashoda Budget: పాన్ ఇండియ‌న్ ప‌రీక్ష‌లో స‌మంత పాస్ అవుతుందా-samantha yashoda movie budget and story details yashoda movie highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha Yashoda Movie Budget And Story Details Yashoda Movie Highlights

Samantha Yashoda Budget: పాన్ ఇండియ‌న్ ప‌రీక్ష‌లో స‌మంత పాస్ అవుతుందా

Nelki Naresh Kumar HT Telugu
Nov 10, 2022 06:55 AM IST

samantha yashoda budget and story: య‌శోద సినిమాతో పాన్ ఇండియ‌న్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది స‌మంత‌. న‌వంబ‌ర్ 11న తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. య‌శోద‌తో పాన్ ఇండియ‌న్ హీరోయిన్ అనే ఇమేజ్‌ను స‌మంత సొంతం చేసుకుంటుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. య‌శోద సినిమా బ‌డ్జెట్‌, క‌థేమిటంటే...

స‌మంత
స‌మంత

samantha yashoda budget and story: స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోన్న య‌శోద సినిమా న‌వంబ‌ర్ 11న‌ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. స‌మంత సోలోగా చేసిన తొలి పాన్ ఇండియ‌న్ సినిమా ఇది. ఈ సినిమాతో తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో త‌న ల‌క్‌ను ప‌రీక్షించుకోబోతున్న‌ది స‌మంత‌. ఫ్యామిలీ మ్యాన్ -2 సిరీస్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర ద్వారా త‌న యాక్టింగ్ టాలెంట్‌ను బాలీవుడ్‌లో చాటిచెప్పింది స‌మంత‌.

ఈ సిరీస్‌తో వ‌చ్చిన పాపులారిటీ య‌శోద సినిమాకు ఎంత వ‌ర‌కు హెల్ప్ అవుతుంది అన్న‌ది రేపు తేల‌నుంది. హిందీతో పాటు మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో డైరెక్ట్‌గా థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతోన్న స‌మంత ఫ‌స్ట్ సినిమా ఇదే. య‌శోద‌తో ఈ మూడు భాష‌ల్లో హిట్ కొట్టి పాన్ ఇండియ‌న్ హీరోయిన్‌గా ఇమేజ్ సొంతం చేసుకుంటుందా లేదా అన్న‌ది చూడాల్సిందే.

అన్ని భాష‌ల వారికి సినిమా కావాల‌నే ఆలోచ‌న‌తోనే వివిధ భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల‌కు ప్ర‌ధాన పాత్ర‌ల కోసం తీసుకున్నారు. మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్‌, త‌మిళం న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ య‌శోద సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు. స‌మంత ఇమేజ్‌కు తోడు సొంత భాష‌ల్లో ఆయా న‌టీన‌టుల‌కు ఉన్న పాపులారిటీ ఈ సినిమాకు హెల్ప్ అవుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

య‌శోద బ‌డ్జెట్ ఎంత‌...

కెరీర్ ఆరంభంలో క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఎక్కువ‌గా చేసిన‌ స‌మంత గ‌త కొన్నేళ్లుగా త‌న రూట్ మార్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు ఇంపార్టెన్స్ ఇస్తోంది. ఓ బేబీతో మ‌హిళా ప్ర‌ధాన క‌థాంశాల‌కు న్యాయం చేయ‌గ‌ల‌ద‌ని నిరూపించుకున్న‌ది. ఆ సినిమా లిమిటెడ్ బ‌డ్జెట్‌లో తెర‌కెక్క‌డంతో నిర్మాత‌ల‌కు లాభాల్ని తెచ్చిపెట్టింది. కానీ క‌థ డిమాండ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని య‌శోద సినిమా కోసం నిర్మాత శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ న‌ల‌భై కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు తెలిసింది.

స‌మంత కెరీర్‌లో హ‌య్యెస్ట్‌...

తొలుత నాలుగు కోట్ల‌తో కేవ‌లం తెలుగులోనే ఈ సినిమా చేయాల‌ని ద‌ర్శ‌కులు హ‌రీ హ‌రీష్‌ అనుకున్నారు. కానీ గ్లోబ‌ల్ రీచ్ ఉన్న కంటెంట్ కావ‌డంతో దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో య‌శోద సినిమా చేసిన‌ట్లు తెలిపారు. ఈ సినిమాలోని హాస్పిట‌ల్ సెట్‌ను దాదాపు ఆరు కోట్ల‌తో వేశారు. ఒక‌ ర‌కంగా స‌మంత కెరీర్‌లో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే.

లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఆ స్థాయిలో ఖ‌ర్చు చేయ‌డం అంటే రిస్క్ అనే అనుకోవాలి. ఆ రిస్క్‌లో స‌మంత గ‌ట్టెక్కుతుందా అన్న‌ది ట్రేడ్ వ‌ర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అన్ని భాష‌ల్లో క‌లిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజిసెన్ 50 కోట్ల‌ను దాటిన‌ట్లు స‌మాచారం. ఈ యాభై కోట్ల టార్గెట్‌ను స‌మంత రీచ్ అవుతుందా లేదా అన్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఒక‌ వేళ వ‌ర్క‌వుట్ అయితే భారీ బ‌డ్జెట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో స‌మంత బెస్ట్ ఛాయిస్‌గా మారిపోతుంది.

నో ప్ర‌మోష‌న్స్‌...

తెలుగు, త‌మిళంలో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. మిగిలిన భాష‌ల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రం మోస్తారుగానే ఉన్నాయి. మ‌రోవైపు తాను మ‌యోసైటిస్‌తో బాధ‌ప‌డుతోన్న‌ట్లు స‌మంత ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ప్ర‌మోష‌న్స్‌లో స‌మంత పెద్ద‌గా పాల్గొన‌డం లేదు. తెలుగు, త‌మిళం వ‌ర‌కు ఒకే కానీ మిగిలిన భాష‌ల్లో అస‌లు ప్ర‌మోష‌న్స్ ఊసు క‌నిపించ‌డం కొంత మైన‌స్‌గా మారే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. కాగా ఈ వారం తెలుగు, త‌మిళ భాష‌ల్లో పెద్ద సినిమాలు రిలీజ్ కాక‌పోవ‌డం య‌శోద‌ సినిమాకు క‌లిసివ‌చ్చే అవ‌కాశం ఉంది.

క‌థేమిటి…

స‌రోగ‌సీ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. స‌రోగ‌సీ అనేది చిన్న ఉప‌క‌థ అని మాత్ర‌మే అని, అంత‌కుమించిన ఎన్నో ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయ‌ని ద‌ర్శ‌క‌ద్వ‌యం అంటున్నారు. య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా య‌శోద సినిమాను రూపొందించిన‌ట్లు పేర్కొన్నారు.

ఇందులో స‌మంత య‌శోద అనే పాత్ర‌లో న‌టిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే కంప్లీట్‌గా యాక్ష‌న్ రోల్‌లో స‌మంత క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్ట‌ర్ కోసం తాను కిక్ బాక్సింగ్ నేర్చుకున్న‌ట్లు స‌మంత తెలిపింది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో స‌మంత ఓన్ డ‌బ్బింగ్ చెప్ప‌గా, ఇత‌ర భాష‌ల్లో వేరే వాళ్ల‌తో చెప్పించిన‌ట్లున్నారు.

ద‌ర్శ‌కుల‌కు ఫ‌స్ట్ సినిమా...

స‌మంత‌తో పాటు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌, ఉన్ని ముకుంద‌న్‌, ముర‌ళీశ‌ర్మ, సంప‌త్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా ద‌ర్శ‌క‌ద్వయం హ‌రీ, హ‌రీష్‌ల‌కు తెలుగులో ఇదే మొద‌టి సినిమా. వారి కెరీర్‌లో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ సినిమా ఇదే. ఇంత‌కుముందు త‌మిళంలో ఒరు ఇర‌వు, అంబులితో పాటు మ‌రో రెండు సినిమాలు తీశారు. య‌శోద‌తో తెలుగులో వారు తొలి ప్ర‌య‌త్నంలోనే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్నారా లేదా అన్న‌ది మ‌రో రోజులో లతేల‌నుంది. య‌శోద‌ సినిమాకు మ‌ణిశ‌ర్మ సంగీతాన్ని అందించాడు.

WhatsApp channel