Samantha Hot Kiss: సమంత హాట్ లిప్ లాక్.. ఆ బోల్డ్ సీన్ వీడియో వైరల్.. ఇదంతా కామనైపోయిందంటూ..-samantha varun dhawan hot kiss gone viral prime video citadel honey bunny web series ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Hot Kiss: సమంత హాట్ లిప్ లాక్.. ఆ బోల్డ్ సీన్ వీడియో వైరల్.. ఇదంతా కామనైపోయిందంటూ..

Samantha Hot Kiss: సమంత హాట్ లిప్ లాక్.. ఆ బోల్డ్ సీన్ వీడియో వైరల్.. ఇదంతా కామనైపోయిందంటూ..

Hari Prasad S HT Telugu
Nov 07, 2024 12:38 PM IST

Samantha Hot Kiss: సమంత హాట్ లిప్ లాక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ తో చేసిన లాంగ్ లిప్ లాక్ వీడియో ఆమె తాజాగా నటించిన సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లోనిది కావడం విశేషం.

సమంత హాట్ లిప్ లాక్.. ఆ బోల్డ్ సీన్ వీడియో వైరల్.. ఇదంతా కామనైపోయిందంటూ..
సమంత హాట్ లిప్ లాక్.. ఆ బోల్డ్ సీన్ వీడియో వైరల్.. ఇదంతా కామనైపోయిందంటూ..

Samantha Hot Kiss: సమంత, వరుణ్ ధావన్ కలిసి నటించిన వెబ్ సిరీస్ సిటడెల్ హనీ బన్నీ. సిటడెల్ స్పై యూనివర్స్ నుంచి ఈ ఇండియన్ వెర్షన్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో గురువారం (నవంబర్ 7) నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ మధ్య ఓ హాట్ కిస్ సీన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సమంత హాట్ కిస్ సీన్

సమంత అనే కాదు సాధారణంగా టాలీవుడ్ హీరోయిన్లు లిప్ లాక్ సీన్లలో నటించడం అరుదే అని చెప్పాలి. అయితే ఎప్పుడైతే ఓటీటీ ఒరిజినల్స్, వెబ్ సిరీస్ వచ్చాయో అప్పటి నుంచీ హాట్ హాట్ సీన్లు కామనైపోయాయి. పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా లిప్ లాక్స్, బోల్డ్ సీన్లలో నటిస్తున్నారు. ఇప్పుడు సమంత కూడా అలాంటి ఓ సీన్లో నటించింది.

నిజానికి గతంలోనూ సామ్ కొన్ని లిప్ లాక్ సీన్లలో కనిపించినా.. సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో మాత్రం వరుణ్ ధావన్ తో ఓ అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. ఈ సుదీర్ఘ హాట్ కిస్ సీన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గురువారం (నవంబర్ 7) ఈ వెబ్ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చినప్పటి నుంచీ ఈ లిప్ లాక్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సెన్సేనల్ లిప్ లాక్.. వెబ్ సిరీస్ లు వచ్చిన తర్వాత ఇంత సుదీర్ఘ కిస్ లు కామనైపోయాయి.. స్క్రీన్ పై సమంత తొలి హాట్ కిస్.. ఇలా ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ చేస్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు.

సిటడెల్ హనీ బన్నీ ఎలా ఉందంటే?

సిటడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ సిటడెల్ స్పై యూనివర్స్ కు ఇండియన్ వెర్షన్. ఇప్పటికే ఇంగ్లిష్, ఇటాలియన్ లాంటి భాషల్లో సిరీస్ లు వచ్చాయి. ఇప్పుడు హిందీలో రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో ఈ సిరీస్ వచ్చింది. అయితే ఇప్పటి వరకూ వచ్చిన బెస్ట్ సిటడెల్ వెబ్ సిరీస్ ఇదే అంటూ సమంత, వరుణ్ ధావన్ సిరీస్ కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి.

రాజ్ అండ్ డీకే అద్భుతమైన డైరెక్షన్ తోపాటు సమంత, వరుణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. సిరీస్ అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు రాగా.. ఉదయం నుంచే ఎక్స్ వేదికగా ఆడియెన్స్ తమ రివ్యూలు ఇస్తున్నారు. ముఖ్యంగా సిరీస్ లోని యాక్షన్ సీన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇంగ్లిష్ లో వచ్చిన సిటడెల్ లో నాదియా సింగ్ పాత్రలో కనిపించిన ప్రియాంకా చోప్రా తల్లిదండ్రుల పాత్రలో ఈ సిటడెల్ హనీ బన్నీలో సమంత, వరుణ్ కనిపించారు.

తమ కూతురిని రక్షించుకోవడానికి వీళ్లేం చేశారన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు. మంచి యాక్షన్ సీన్స్ తోపాటు థ్రిల్ కూడా పంచుతున్న ఈ వెబ్ సిరీస్ తో రాజ్ అండ్ డీకే మరో హిట్ అందుకున్నట్లే. గతంలో ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్లు, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్ లు అందించిన ఈ దర్శక ద్వయం.. ఇప్పుడీ సిటడెల్ హనీ బన్నీని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చింది.

Whats_app_banner