OTT: టాప్ ట్రెండింగ్‌లో ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్.. వరల్డ్‌వైడ్ నెం.1 సిరీస్‌గా రికార్డ్
Citadel Honey Bunny Web series: సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగించేస్తోంది. వారం క్రితం విడుదలైన ఈ వెబ్ సిరీస్…?
సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ ఓటీటీలో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. నవంబరు 6 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్.. వారం వ్యవధిలోనే వరల్డ్ వైడ్‌గా అమెజాన్‌లో అత్యధిక మంది వీక్షించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది.
వరల్డ్ వైడ్ నెం.1
సిటాడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్‌లో సమంత, వరుణ్ ధావన్ ఎజెంట్‌లు నటించారు. దాంతో ఆ కోడ్ లాంగ్వేజ్‌లోనే అమెజాన్ ప్రైమ్ కూడా రియాక్ట్ అయ్యింది. ‘‘గూఢచారులు కేవలం కోడ్‌లను మాత్రమే కాదు.. రికార్డులను కూడా బ్రేక్ చేయగలరు’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చింది.
సమంత కూడా రియాక్ట్ అవుతూ ‘వరల్డ్ వైడ్ నెం.1’ అని పోస్ట్ చేయగా.. వరుణ్ ధావన్ ‘నేను నమ్మలేకపోతున్నాను. ప్రపంచంలోనే మనదే నెం.1 షో.. ఇది కలగానే ఉండేది. కానీ.. ఇప్పుడు నిజమైంది’’ అని రిప్లై ఇచ్చాడు.
సిటాడెల్: హనీ బన్నీ టాప్ ట్రెండింగ్‌లో నిలవడంపై సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ‘‘పాన్ వరల్డ్ స్టార్స్’’ అంటూ రాహుల్ రవీంద్రన్ అభివర్ణించగా.. జాన్వీ కపూర్ కూడా ప్రశంసలు కురిపిస్తూ ‘‘ఇది చాలా అద్భుతమైన సిరీస్’ అని రాసుకొచ్చింది. సిటాడెల్ గురించి: హనీ బన్నీ సిరీస్‌కి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు.
కథ ఏంటంటే?
హనీ (సమంత) సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తుంటుంది. ఆమెకి సెట్స్‌లో స్టంట్ మాస్టర్‌గా ఉన్న బన్నీ (వరుణ్ ధావన్)తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారుతుంది. బన్నీ స్టంట్ మాస్టర్‌గానే ఒకవైపు చేస్తూనే.. ఓ ప్రైవేట్ సంస్థలో ఏజెంట్‌గా చేస్తుంటాడు. అయితే.. అనూహ్య పరిస్థితుల్లో ఆ ఏజెంట్ టీమ్‌లో సమంత చేరుతుంది.
హనీ, బన్నీ ఇద్దరూ కీలకమైన ఏజెంట్ ఆపరేషన్‌లో పాల్గొని చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఆ ఆపరేషన్ ఏంటి? ఆ చిక్కుల్ని ఎలా పరిష్కరించుకుని.. సేవ్ అవుతారు? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లను హనీ, బన్నీ ఎదుర్కొంటారు ? అనేది కథ.
వెబ్ సిరీస్‌లో స్టంట్స్‌తో యాక్షన్ సీన్లలో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన సమంత.. ఒక కూతురికి తల్లిగా కన్నీళ్లు కూడా పెట్టిస్తుంది. మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్న ఈ వెబ్ సిరీస్.. ట్విస్ట్‌లు, కామెడీ, రొమాంటిక్, సెంటిమెంట్‌తో ఆసక్తికరంగా సాగుతుంది.