దుబాయ్ లో చీరకట్టులో అందంగా సమంత.. అదిరే లుక్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఆ ఈవెంట్ కోసం స్పెషల్ గా రెడీ-samantha ruth prabu stunning looks in saree goes viral in internet dubai jewelery brand launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  దుబాయ్ లో చీరకట్టులో అందంగా సమంత.. అదిరే లుక్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఆ ఈవెంట్ కోసం స్పెషల్ గా రెడీ

దుబాయ్ లో చీరకట్టులో అందంగా సమంత.. అదిరే లుక్ కు ఫ్యాన్స్ ఫిదా.. ఆ ఈవెంట్ కోసం స్పెషల్ గా రెడీ

దుబాయ్ లో జ్యువెలరీ బ్రాండ్ లాంచ్ సందర్భంగా సమంత రూత్ ప్రభు కొత్త ఫొటోలను షేర్ చేసింది. చీరకట్టులో ఆమె మెరిసిపోయింది. ఈ ఫొటోలు సోషల్ మీడియలో తెగ వైరల్ గా మారాయి.

సమంత రూత్ ప్రభు

నటి సమంత రూత్ ప్రభు దుబాయ్ లో ఓ జ్యువెలరీ బ్రాండ్ ప్రారంభోత్సవానికి హాజరైంది. ఈ సందర్భంగా మెరిసే చీరలో ఆమె తళుక్కుమంది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఆమె లుక్ నచ్చి చీరకట్టులో ఎంత అందంగా ఉందో అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. చీరలో సమంత ఫొటోలు తెగ వైరల్ గా మారాయి.

సమంత చీర లుక్

సమంత అందమైన ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న లేత పసుపు రంగు చీరలో కనిపించింది. లుక్ కోసం లేస్ డిజైన్ తో సరిపోయే పసుపు రంగు బ్లౌజ్ ను జత చేసి, జుట్టును విప్పి ఎడమ వైపుకు విడదీసింది. ఓ ఫొటోలో హోటల్ గది బాల్కనీలో సమంత ఆమె ఫోజులిచ్చింది. మరో ఫొటోలో జ్యువెలరీ బ్రాండ్ నుంచి 'సర్టిఫికేట్ ఆఫ్ ప్రజెంటేషన్'గా బహుమతిగా ఇచ్చిన జ్ఞాపికను ఆమె పట్టుకుంది. ఈ కార్యక్రమంలో అభిమానులతో కలిసి సెల్ఫీలు దిగింది సామ్. 'విస్తృతంగా మేల్కొని కలలు కంటున్నా..' అంటూ క్యాప్షన్ ఇచ్చింది ఈ భామ.

అభిమానుల రియాక్షన్స్

ఫొటోలపై స్పందించిన ఓ అభిమాని 'నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది సామ్! నువ్వు ఎదగడం చూడటం చాలా ఆనందంగా ఉంది’ అని పేర్కొన్నాడు. మరో అభిమాని 'ఇంత అందమైన మహిళ.. చీర మీకు ఎంతో అందంగా ఉంది' అని కామెంట్ చేశాడు. "ఎప్పటికీ ఫేవరెట్. చాలా క్యూట్ గా ఉంది' అని మరో అభిమాని కామెంట్ చేశాడు.

డేటింగ్ పుకార్లు

గత కొన్ని వారాలుగా రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందంటూ అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను ఆమె బృందం ఖండించింది.సమంత ఇటీవలే ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ను ప్రారంభించి నిర్మాతగా మారింది. ఈ బ్యానర్ పై శుభం టైటిల్ తో ఫస్ట్ సినిమాను రిలీజ్ చేసింది.

చివరిసారిగా 2023లో వచ్చిన శాకుంతలం, ఖుషి చిత్రాల్లో నటించింది సామ్. వరుణ్ ధావన్ తో కలిసి రాజ్ అండ్ డీకే ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో కనిపించింది. నెట్ ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్', తన ప్రొడక్షన్ హౌస్ కోసం 'మా ఇంటి బంగారం' చిత్రాలు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్నాయి.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం