సమంత సినిమాకు ఓటీటీ ట్విస్ట్! ఏం జరిగిదంటే..-samantha ruth prabhu subham movie ott deal in jeopardy zee5 platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  సమంత సినిమాకు ఓటీటీ ట్విస్ట్! ఏం జరిగిదంటే..

సమంత సినిమాకు ఓటీటీ ట్విస్ట్! ఏం జరిగిదంటే..

సమంత నిర్మించిన శుభం చిత్రం థియేటర్లలో మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. రన్ దాదాపు పూర్తయింది. ఈ చిత్రానికి ఓటీటీ ట్విస్ట్ ఎదురైనట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇవే..

సమంత సినిమాకు ఓటీటీ ట్విస్ట్! ఏం జరిగిదంటే..

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ ఈనెల మే 9వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ తెలుగు హారర్ కామెడీ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రీయా కొంతం లీడ్ రోల్స్ చేశారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో అనుకున్న రేంజ్‍లో సక్సెస్ దక్కలేదు. అయితే శుభం చిత్రానికి ఇప్పుడు ఓటీటీ ఎదురుదెబ్బ ఎదురైందని తెలుస్తోంది.

ట్విస్ట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్!

శుభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. క్రేజ్ ఉండడంతో మంచి ధరకు దక్కించుకుందని తెలిసింది. అయితే, ఇప్పుడు ఆ ఓటీటీ సంస్థ ట్విస్ట్ ఇచ్చిందట. ఓ డీల్ క్యాన్సిల్ చేసేందుకు జీ5 నిర్ణయించుకుందని ఓటీటీ ప్లే రిపోర్ట్ వెల్లడించింది. శుభం మూవీ హక్కుల ఒప్పందం నుంచి వైదొలిగేందుకు జీ5 సిద్ధమైందని సమాచారం.

రంగంలోకి సమంత

శుభం సినిమా స్ట్రీమింగ్ హక్కుల విషయంలో జీ5తో చర్చలు జరిపేందుకు సమంత ఇప్పటికే రంగంలోకి దిగారట. ఆ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఆర్థిక విషయాల కారణంగా ఈ డీల్ సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో వేరే ఓటీటీలను కూడా సంప్రదించాలని సమంత డిసైడ్ అయినట్టు ఆ రిపోర్ట్ పేర్కొంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

చాలా కష్టపడిన సమంత

తాను స్థాపించిన త్రాతాల మూవింగ్ పిక్చర్స్ పతాకంపై తొలి చిత్రంగా శుభంను సమంత ప్రొడ్యూజ్ చేశారు. నిర్మాతగా మారారు. ఈ సినిమా ప్రమోషన్ల కోసం సమంత చాలా కష్టపడ్డారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‍తో పాటు మరిన్ని ప్రమోషనల్ కార్యక్రమాలకు హాజరయ్యారు. కొన్ని థియేటర్లకు వెళ్లి కూడా ప్రమోషన్లు చేశారు. ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు బాగా కృషి చేశారు.

శుభం కలెక్షన్లు

శుభం సినిమా ఇప్పటి వరకు సుమారు రూ.6కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం రూ.8కోట్ల గ్రాస్ బ్రేక్ఈవెన్ టార్గెట్‍తో వచ్చింది. దీంతో ఈ మూవీ ఇంకా బ్రేక్ఈవెన్ చేరలేదు. దాదాపు థియేట్రికల్ రన్ పూర్తవటంతో ఇక ఆ మార్క్ చేరడం కష్టమే. ఇప్పుడు ఓటీటీ డీల్ విషయంలోనూ సమంతకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

టీవీ సీరియల్ చూస్తూ భయానకంగా మారే మహిళల కథాంశంతో శుభం సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో హర్షిత్, శ్రీనివాస్, శ్రీయాతో పాటు చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి కూడా ముఖ్యమైన రోల్స్ చేశారు. సమంత క్యామియో రూల్‍లో కనిపించారు. ఈ చిత్రానికి మృదుల్ సుజీత్‍సేన్ మ్యూజిక్ ఇచ్చారు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం