వోగ్ బ్యూటీ అండ్ వెల్నెస్ ఆనర్స్ కార్యక్రమానికి హాజరైన నటి సమంత రూత్ ప్రభు సోమవారం సాయంత్రం బ్రౌన్ కలర్ డ్రెస్ లో అదరగొట్టింది. ఓ ఫొటోగ్రాఫర్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో ఆమె చాలా అందంగా కనిపించింది. ఈవెంట్ కోసం లోపలికి వెళ్లేముందు లోపలికి వెళ్లేముందు ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ లుక్ లో సమంత హాట్ గా కనిపించింది. ఆమె స్టన్నింగ్ లుక్ వైరల్ గా మారింది.
ఈ వీడియోలో సమంత బ్రౌన్ కలర్ (గోధుమ రంగు) డ్రెస్ లో అదరగొట్టింది. ఆ డ్రెస్ పక్కన, ఛాతి దగ్గర కటౌట్ లాంటి డిటైలింగ్ తో కనిపిస్తుంది. మ్యాచింగ్ హీల్స్, న్యూట్రల్ మేకప్, లూజ్ వేవ్ హెయిర్ తో ఆమె ఈ లుక్ ను మరింత అట్రాక్టివ్ గా మార్చింది. డిజైనర్ క్రేషా బజాజ్ తో కలిసి కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చిన సమంత ఆ తర్వాత స్టాప్ అండ్ పోజులో మరికొన్ని సోలో ఫోటోలకు ఫోజులిచ్చింది.
సమంత లుక్ వైరల్ గా మారింది. దీనిపై ఫ్యాన్స్ రియాక్టవుతున్నారు. వారిలో ఒకరు హార్ట్ ఎమోజీలతో "మమ్మీ" అని కామెంట్ చేశారు. మరొకరు 'ఓఎంజీ ఆమె చాలా బరువు తగ్గింది' అని రాశారు. 'ఆ డ్రెస్ (ఫైర్ ఎమోజీ)' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'కేన్స్ లో భారత్ కు ప్రాతినిధ్యం వహించాల్సింది.. మేం చెత్తను పంపించాం' అని మరో అభిమాని పేర్కొన్నారు. ఒకరు ఆమెను 'క్వీన్ ఆఫ్ ది ఇండియన్ సినిమా' అని పిలుచుకోగా, మరికొందరు హార్ట్ ఎమోజీలతో కామెంట్లు చేశారు.
మయోసైటిస్ కోసం ఆమె తీసుకున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ బరువు పెరగకుండా నిరోధిస్తుందని సమంత గతంలో తెలిపింది. సారా టెండూల్కర్, శిల్పా శెట్టి, టైగర్ ష్రాఫ్, కృష్ణ ష్రాఫ్, భూమి ఫడ్నేకర్, అదితి రావు హైదరి వంటి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
చివరగా 2023లో వచ్చిన శాకుంతలం, ఖుషి చిత్రాల్లో సమంత నటించింది. 2024 లో ఆమె రాజ్ & డీకే ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో వరుణ్ ధావన్ తో కలిసి యాక్ట్ చేసింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ స్థాపించి సమంత నిర్మాతగా మారింది. ప్రొడ్యూసర్ గా శుభం మూవీని నిర్మించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ కోసం రాజ్ అండ్ డీకే 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్', తన నిర్మాణ సంస్థ కోసం 'మా ఇంటి బంగారం' చిత్రాల్లో నటిస్తోంది సామ్.
రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరైన దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తోందని ఇటీవల పుకార్లు వచ్చాయి. అయితే ఆ పుకార్లకు ఆమె టీమ్ ఫుల్ స్టాప్ పెట్టింది.
సంబంధిత కథనం