అప్పటివరకూ క్యూట్ గా, పక్కింటి అమ్మాయిలా నటిస్తూ వచ్చిన సమంత ఒక్కసారిగా ‘పుష్ఫ ది రైజ్’ మూవీలో స్పెషల్ సాంగ్ తో షాక్ ఇచ్చారు. హాట్ డ్యాన్స్ తో అదరగొట్టారు. సమంత నుంచి ఈ సర్ ప్రైజ్ ను ఫ్యాన్స్ ఊహించలేకపోయారు. ఈ సమంత స్పెషల్ సాంగ్ ఓ ఊపు ఊపింది. పుష్ఫ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఈ పాట కూడా ఓ రీజన్ అని చెప్పొచ్చు. ఈ సాంగ్ పై తాజాగా సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప: ది రైజ్‌లో సమంత రూత్ ప్రభు ఊ అంటావా పాటతో అభిమానులను అలరించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. గలట్టా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ పాట గురించి కొన్ని సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ పాట చేయొద్దని చాలామంది తనకు సలహా ఇచ్చారని ఆమె అన్నారు. ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకున్నానని పేర్కొన్నారు.
ఓ స్టేట్‌మెంట్ ఇచ్చేందుకే ఈ పాట చేశారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సమంత ఇచ్చిన జవాబు హాట్ టాపిక్ గా మారింది.
“నేను ఇతరుల కోసం స్టేట్‌మెంట్ ఇస్తానని చాలామంది అనుకుంటారు. కానీ నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవడానికి చూస్తా. నా జీవితంలో నేనెప్పుడూ నన్ను అందంగా, హాట్‌గా అనుకోలేదు. నేను అలా నటించగలనో లేదో చెక్ చేసుకోవడానికి ఊ అంటావా సాంగ్ ఓ అవకాశం. ఇంతకు ముందు ఎప్పుడూ అలా చేయలేదు. కాబట్టి ఇది నిజంగా నాకే ఒక ఛాలెంజ్. అందుకే ఒక్కసారి మాత్రమే చేయాలనుకున్నా.” అని సమంత తెలిపారు.
ఊ అంటావా తనకు ఆఫర్ వచ్చినప్పుడు ఆశ్చర్యపోయానని సమంత అన్నారు. “స్పెషల్ సాంగ్ కోసం నన్ను ఎవరు అనుకుంటారు? పైగా నేను చాలా హాట్‌గా కనిపించాల్సిన పాట అది. నేను ఎప్పుడూ క్యూట్, బబ్లీ అమ్మాయి పాత్రలే చేశా. ఇది డ్యాన్స్ గురించి కాదు, నా వైఖరి గురించి. నేను ఎప్పుడూ నా లైంగికతలో సౌకర్యంగా ఉంటా. నా చుట్టూ ఉన్నవాళ్లు ఈ సాంగ్ చేయొద్దన్నారు. కానీ నాకు లిరిక్స్ నచ్చాయి’’ అని ఆమె తెలిపారు.
‘‘ఇంతకు ముందు ఎవరూ నాకు ఇలాంటి అవకాశం ఇవ్వలేదు. అందుకే ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నా. మొదటి షాట్ ముందు 500 మంది జూనియర్ ఆర్టిస్టుల ముందు నేను వణికిపోయా. చాలా భయంగా ఉంది” అని సమంత అన్నారు.
సమంత్ తాజాగా ప్రొడ్యూసర్ గా మారారు. ఆమె నిర్మించిన ఫస్ట్ సినిమా ‘శుభం’ రీసెంట్ గా రిలీజైంది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక యాక్టింగ్ పరంగా చూస్తే సమంత త్వరలో ది ఫ్యామిలీ మ్యాన్ తర్వాతి సీజన్ లో కనిపించనున్నారు. రాజ్ & డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, జైదీప్ అహ్లావత్, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇది నవంబర్‌లో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.
సంబంధిత కథనం