Samantha on Item Songs: ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయను.. అందుకే నా వ్యాధిని బయటపెట్టాల్సి వచ్చింది: సమంత-samantha ruth prabhu says she will never do a song like oo antava she was forced to announce her disease ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha Ruth Prabhu Says She Will Never Do A Song Like Oo Antava She Was Forced To Announce Her Disease

Samantha on Item Songs: ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయను.. అందుకే నా వ్యాధిని బయటపెట్టాల్సి వచ్చింది: సమంత

Hari Prasad S HT Telugu
Mar 16, 2024 02:03 PM IST

Samantha on Item Songs: టాలీవుడ్ నటి సమంత ఊ అంటావాలాంటి ఐటెమ్ సాంగ్ మళ్లీ చేయనని చెప్పింది. అంతేకాదు తనకున్న మయోసైటిస్ వ్యాధి గురించి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.

ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయనంటున్న సమంత
ఊ అంటావా లాంటి ఐటెమ్స్ సాంగ్ మళ్లీ చేయనంటున్న సమంత

Samantha on Item Songs: టాలీవుడ్‌లో టాప్ నటిగా ఉన్న సమంత పుష్ప మూవీలో ఊ అంటావాలాంటి ఐటెమ్ సాంగ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పాటలో ఆమె అల్లు అర్జున్ తో వేసిన స్పెప్పులు కూడా షాకింగా ఉన్నాయి. అయితే అలాంటి ఐటెమ్ సాంగ్ తాను మళ్లీ చేయనని ఆమె చెబుతోంది. ఇండియా టుడే కాన్‌క్లేవ్ లో మాట్లాడిన సామ్.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

ఆ పాట చేస్తూ వణికిపోయాను

ఊ అంటావా సాంగ్ చేసే సమయంలో తాను వణికిపోయినట్లు సమంత వెల్లడించింది. సెక్సీ అనేది తనకు సరిపడదని, అందుకే తాను అలా ఫీలైనట్లు చెప్పింది. తన వరకూ ఊ అంటావా పాట, ఫ్యామిలీ మ్యాన్ లో రాజీ పాత్ర ఒకటే అని చెప్పింది. "నేనెప్పుడూ అంత బాగా లేను.

అందంగా లేను. ఇతర అమ్మాయిలలాగా లేను అన్న ఆలోచనలతోనే పని చేశాను. అందుకే నాకు అది పెద్ద ఛాలెంజ్ అనుకున్నాను. ఊ అంటావా మొదటి షాట్ లో నేను వణికిపోయాను. ఎందుకంటే సెక్సీ అనేది నాకు సరిపడని విషయం. కానీ అలాంటి అసౌకర్యమైన, కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే నన్ను నేను ఓ నటిగా, వ్యక్తిగా వృద్ధి చెందుతూ వచ్చాను" అని సమంత తెలిపింది.

ఊ అంటావాలాంటి పాట మళ్లీ చేస్తారా అన్ని ప్రశ్నించగా చేయనని చెప్పింది. "లేదు, ఇక అలాంటి వాటిలో సవాలంటూ ఏమీ లేదు. ఆ పాటలోని లిరిక్స్ నాకో ఛాలెంజ్" అని సమంత స్పష్టం చేసింది.

ఆ వ్యాధి గురించి అందుకే చెప్పాను

ఇక తనకున్న మయోసైటిస్ వ్యాధి గురించి తప్పనిసరి పరిస్థితుల్లోనే వెల్లడించాల్సి వచ్చిందని సమంత తెలిపింది. యశోద మూవీ సమయంలోనే ఆమె ఈ విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పుడు వస్తున్న పుకార్లు, తప్పుడు సమచారాలకు అడ్డుకట్ట వేయడానికి తాను దీని గురించి చెప్పాల్సి వచ్చిందని సామ్ తెలిపింది.

"నాకున్న వ్యాధి గురించి తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది. ఆ సమయంలో నా ఫిమేల్ సెంట్రిక్ మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. అప్పుడు నేను చాలా అనారోగ్యంతో ఉన్నాను. నేను దానికి సిద్ధంగా లేను. పుకార్లు వ్యాపిస్తున్నాయి. తప్పుడు సమాచారాలు బయటకు వస్తున్నాయి. ఆ సినిమాను ప్రమోట్ చేయాలని, లేదంటే ఫ్లాపవుతుందని ప్రొడ్యూసర్లు నాతో అన్నారు.

ఆ సమయంలో మరీ ఎక్కువ డోసుల్లో మెడికేషన్ పై ఉన్నాను. అందువల్ల అది తప్పనిసరి పరిస్థితి. లేదంటే ఆ విషయం ఎప్పటికీ బయటకు చెప్పేదానిని కాదు" అని సమంత స్పష్టం చేసింది.

సానుభూతి కోసం చూస్తున్నానంటూ తనను సింపథీ క్వీన్ అని కూడా పిలిచినట్లు సమంత ఈ సందర్భంగా వాపోయింది. అయితే ఈ కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాతే తాను ఇవాళ ఓ నటిగా, వ్యక్తిగా ఈ స్థాయికి చేరుకున్నట్లు చెప్పింది. ఖుషీ మూవీ తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సమంత.. ఇక ఇప్పుడు సిటడెల్ అనే వెబ్ సిరీస్ తో రాబోతోంది.

IPL_Entry_Point