Samantha on Remuneration: రెమ్యూనరేషన్ కోసం నేను ఎవర్నీ అడుక్కోను.. సామ్ షాకింగ్ కామెంట్స్-samantha ruth prabhu says she should not have to beg for remuneration ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha On Remuneration: రెమ్యూనరేషన్ కోసం నేను ఎవర్నీ అడుక్కోను.. సామ్ షాకింగ్ కామెంట్స్

Samantha on Remuneration: రెమ్యూనరేషన్ కోసం నేను ఎవర్నీ అడుక్కోను.. సామ్ షాకింగ్ కామెంట్స్

Maragani Govardhan HT Telugu
Mar 29, 2023 05:40 AM IST

Samantha on Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం శాకుంతలం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా రెమ్యూనరేషన్ గురించి ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. పారితోషికం కోసం తను ఎవర్నీ అడుక్కోనంటూ స్పష్టం చేసింది.

 సమంత
సమంత

Samantha on Remuneration: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. గతేడాది అనారోగ్య కారణాల దృష్ట్యా ఎక్కువ కాలం మూవీస్‌కు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం తన పెండింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే విజయ్‌తో ఖుషి, బాలీవుడ్‌లో సిటడెల్‌లో చేస్తూ తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం ఆమె నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహించారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్లలో సామ్ విరివిగా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. తన వర్క్, ఆరోగ్య, తనపై వచ్చిన ట్రోల్స్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఇందులో భాగంగా ఇటీవలే తన పారితోషికానికి సంబంధించి షాకింగ్ కామెంట్స్ చేసింది సామ్. తను రెమ్యూనరేషన్ కోసం ఎవర్నీ అడుక్కోనని, తన హార్డ్ వర్క్, విజయాలతోనే కావాల్సినంత దక్కించుకుంటానని స్పష్టం చేసింది.

"నేను చాలా గట్టిగా ఫైట్ చేస్తాను. అయితే ప్రత్యక్షంగా కాదు. పారితోషికంగా సమానంగా ఉండాలని నేను పోరాటం చేయను. హార్డ్ వర్క్, సక్సెస్‌తో ద్వారా వచ్చే బై ప్రొడక్ట్‌ను కావాలనుకుంటున్నాను. ఎదుటివారే వచ్చే అవును మేము మీకు ఇంత చెల్లించాలనుకుంటున్నాము అని చెప్పాలి. అందుకోసం నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఇది తీవ్రమైన హార్డ్ వర్క్ తర్వాత వస్తుందని నేను నమ్ముతాను." అని సమంత స్పష్టం చేసింది.

సామ్ తన ఆరోగ్య పరిస్థితి కూడా స్పందించింది. గతేడాది మయోసైటిస్ ఆనే ఆటో ఇమ్యూన్ హెల్త్ కండీషన్‌తో బాధపడుతున్నప్పుడు తన నిర్మాతలు, దర్శకులు ఎంతో మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది.

"ఏ రోజు ఒకేలా ఉండదు. ప్రతి రోజూ విభిన్నంగా ఉంటుంది. అక్కడ ఎత్తు, పల్లాలు ఉంటాయి. అందులోనూ మరీ అల్పాలు కూడా ఉంటాయి. నా నిర్మాతలు, దర్శకులు నా కోసం వెయిట్ చేశారు. అవసరమైన ఎనర్జీని ఇచ్చారు. అందుకు నేను నిజంగా కృతజ్ఞురాలినై ఉంటాను. అదే తిరిగి సెట్‌లోకి వచ్చేందుకు తీవ్రంగా ఫైట్ చేయాలని కోరుకునేలా చేసింది." అని సామ్ స్పష్టం చేసింది.

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న శాకుంతలం సినిమాకు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శకుంతల పాత్రలో సమంత.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్