Samantha Ruth Prabhu: సమంతకు నచ్చని హృతిక్ రోషన్ లుక్స్.. నాగ చైతన్య కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సామ్!-samantha ruth prabhu rating to naga chaitanya more than hrithik roshan in body looks earlier her career comments viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Ruth Prabhu: సమంతకు నచ్చని హృతిక్ రోషన్ లుక్స్.. నాగ చైతన్య కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సామ్!

Samantha Ruth Prabhu: సమంతకు నచ్చని హృతిక్ రోషన్ లుక్స్.. నాగ చైతన్య కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సామ్!

Sanjiv Kumar HT Telugu

Samantha Ruth Prabhu Rating To Naga Chaitanya Hrithik Roshan: సమంత రూత్ ప్రభుకు బాలీవుడ్ గ్రీక్ గాడ్, వార్ 2 హీరో హృతిక్ రోషన్ లుక్స్ అంటే నచ్చవట. అంతేకాకుండా లుక్స్‌లో హృతిక్ రోషన్ కంటే నాగ చైతన్యకు ఎక్కువ రేటింగ్‌ను సమంత ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సమంతకు నచ్చని హృతిక్ రోషన్ లుక్స్.. నాగ చైతన్య కంటే తక్కువ రేటింగ్ ఇచ్చిన సామ్!

Samantha Ruth Prabhu Rating To Naga Chaitanya Hrithik Roshan: అందగాడు అంటే ఉదాహరణకు చూపించే హీరోల్లో హృతిక్ రోషన్ ముందుంటాడు. బాలీవుడ్ గ్రీక్ గాడ్ అంటూ హృతిక్ రోషన్‌కు బిరుదు కూడా ఉంది. ఎంతోమంది అమ్మాయిలకు హృతిక్ రోషన్ అన్నా, తన బాడీ, లుక్స్ అంటే విపరీతమైన ఇష్టం.

సోషల్ మీడియాలో వైరల్

అలాంటి హృతిక్ రోషన్ లుక్స్ అంటే తనకు మాత్రం నచ్చదని సౌత్ స్టార్ హీరోయిన్ సమంత చెప్పుకొచ్చింది. అంతేకాకుండా లుక్స్‌లో హృతిక్ రోషన్ కంటే నాగ చైతన్యకు ఎక్కువ రేటింగ్ ఇవ్వడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది ఈ విషయం. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో హాట్‌గా వైరల్ అవుతోంది.

మహేశ్ బాబు 10కి 10

వివరాల్లోకి వెళితే.. ఏ మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత కెరీర్ తొలి నాళ్లలో పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంది. ఓ న్యూస్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లుక్స్ ఆధారంగా హీరోలకు రేటింగ్ ఇవ్వమని సమంతను యాంకర్ కోరారు. అప్పుడు మహేశ్ బాబుకు 10/10 రేటింగ్ ఇచ్చిన సమంత "నేను ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు" అని చెప్పింది.

నన్ను చంపేస్తారు

ఆ తర్వాత హృతిక్ రోషన్‌కు రేటింగ్ ఇవ్వమని యాంకర్ అడగ్గా.. 'దీనికి అందరూ నన్ను చంపేస్తారు కానీ.. హృతిక్ లుక్స్ నాకు అంతగా నచ్చవు' అని బదులిచ్చిన సమంత 7/10 ఇచ్చింది. ఆ తర్వాత నాగచైతన్యకు 10/10, రణబీర్ కపూర్ 8/10 రేటింగ్ ఇచ్చింది సమంత. ఇక కబీర్ సింగ్ హీరో షాహిద్ కపూర్ గురించి అడిగినప్పుడు "కమీనే మూవీకి ముందు 5/10, కమీనే తర్వాత 9/10" అని సమంత తెలిపింది.

హృతిక్ రోషన్ కంటే ఎక్కువగా

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను రెడిట్‌లో ఓ యూజర్ షేర్ చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. హృతిక్ రోషన్ కంటే నాగ చైతన్యకు బాడీ లుక్స్‌లో ఎక్కువ రేటింగ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్' అనే ఓటీటీ సిరీస్‌లో నటిస్తోంది.

రక్త్ బ్రహ్మాండ్-శుభం

ఈ వెబ్ సిరీస్‌కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. బ్లడీ యాక్షన్, అద్భుతమైన విజువల్ వండర్‌గా రక్త్ బ్రహ్మాండ్ తెరకెక్కనుంది. ఇదే కాకుండా సమంత నిర్మాతగా శుభం మూవీ రానుంది. కామెడీ హారర్‌గా తెరకెక్కిన శుభం టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. శుభం మూవీ మే 9న విడుదల కానుంది.

మయసభతో నాగ చైతన్య

ఇక బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2 మూవీ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ విలన్ రోల్ పోషించిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇక నాగ చైతన్య విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మతో ఎన్‌సీ24, దేవకట్టాతో మయసభ ఓటీటీ వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్నాడు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం