Samantha Subham Movie: సమంత ప్రొడ్యూస్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ శుభం రిలీజ్ డేట్ ఇదే-samantha ruth prabhu producing horror comedy movie subham release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Subham Movie: సమంత ప్రొడ్యూస్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ శుభం రిలీజ్ డేట్ ఇదే

Samantha Subham Movie: సమంత ప్రొడ్యూస్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ శుభం రిలీజ్ డేట్ ఇదే

Hari Prasad S HT Telugu

Samantha Subham Movie: సమంత రుత్ ప్రభు నిర్మిస్తున్న తొలి సినిమా శుభం మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుక్రవారం (ఏప్రిల్ 18) మూవీ రిలీజ్ తేదీని వెల్లడించింది.

సమంత ప్రొడ్యూస్ చేస్తున్న హారర్ కామెడీ మూవీ శుభం రిలీజ్ డేట్ ఇదే

Samantha Subham Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు కొన్నాళ్ల కిందట ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ హౌజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్లో ఆమె నిర్మిస్తున్న తొలి సినిమా శుభం. హారర్ కామెడీ జానర్లో వస్తున్న ఈ సినిమా రిలీజ్ తేదీని సమంత శుక్రవారం (ఏప్రిల్ 18) అనౌన్స్ చేసింది.

శుభం రిలీజ్ డేట్

సమంత ప్రొడ్యూస్ చేసిన మూవీ శుభం. ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. “మీకు శుభం కలుగుగాక. మే 9న మిమ్మల్ని థియేటర్లలో కలుస్తా” అనే క్యాప్షన్ తో సమంత రిలీజ్ తేదీని అనౌన్స్ చేసింది.

కొన్ని రోజుల కిందట ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గత నెల 30వ తేదీన ఈ టీజర్ తీసుకొచ్చారు. శుభం సినిమాకు సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేశారు.

శుభం టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కొత్త పెళ్లి కొడుకు (హర్షిత్ రెడ్డి), పెళ్లి కూతురు శ్రీవల్లి (శ్రీయా) శోభనం గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. “మా వాడు అమాయకుడు, మొత్తం నువ్వే చూసుకోవాలని మీ అమ్మ చెప్పారు” అని అతడితో శ్రీవల్లి అంటుంది. తాను ధైర్యవంతుడినని చెప్పేందుకు డైలాగ్‍లు చెబుతాడు హర్షిత్. ఇంతలో రిమోట్‍ తీసుకొని టీవీ ఆన్ చేస్తుంది అమ్మాయి.

అక్కడే ట్విస్ట్ ఎదురవుతుంది. శోభనం గదిలోనే సీరియల్స్ చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇప్పుడు సీరియల్ చూడడం ఏంటి అని హర్షిత్ అంటే.. ఉష్ అంటూ సీరియస్‍గా అంటుంది శ్రీవల్లి. దీంతో అతడు బెదిరిపోతాడు. టీవీ సీరియల్స్ చూసి భర్తను శ్రీవల్లి ఆటాడుకుంటుందనేలా సీన్స్ ఉన్నాయి. ఆల్ఫా మేల్ కాకపోతే భార్య వదిలివెళ్లిపోతుందని హర్షిత్‍ను స్నేహితులు బెదిరిస్తారు.

శుభం మూవీ గురించి..

సీరియల్స్ పిచ్చి ఉన్న భార్యతో భర్త పడే ఇబ్బందుల చుట్టూ శుభం మూవీ సాగుతుందని టీజర్ చూస్తే ద్వారా అర్థమవుతోంది. ఈ మూవీకి ‘చచ్చినా చూడాల్సిందే’ అనే ట్యాగ్‍లైన్ కూడా ఉంది.

సినిమాబండి మూవీతో ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుడటంతో శుభం చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సమంత నిర్మాతగా చేస్తున్న తొలి సినిమా కావడం కూడా ప్రత్యేకంగా నిలుపుతోంది. ఈ చిత్రానికి వసంత్ మారిగంటి కథ అందించారు.

శుభం చిత్రంలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, శ్రీనివాస్‍తో పాటు చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి, షాలినీ కొండేపూడి, వంశీధర్ గౌడ్ కీలకపాత్రలు పోషించారు. క్లింటన్ సెరెజో ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం