Samantha: వారియర్ అంటూ హీనా ఖాన్ గురించి సమంత పోస్ట్.. స్పందించిన బాలీవుడ్ నటి-samantha ruth prabhu prays for hina khan recovery she replied ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: వారియర్ అంటూ హీనా ఖాన్ గురించి సమంత పోస్ట్.. స్పందించిన బాలీవుడ్ నటి

Samantha: వారియర్ అంటూ హీనా ఖాన్ గురించి సమంత పోస్ట్.. స్పందించిన బాలీవుడ్ నటి

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 02, 2024 07:25 PM IST

Samantha Ruth Prabhu - Hina Khan: రొమ్ము క్యాన్సర్‌కు గురైన బాలీవుడ్ నటి హీనా ఖాన్ గురించి సమంత స్పందించారు. ఆమె కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. దీనికి హీనా కూడా స్పందించారు.

Samantha: వారియర్ అంటూ హీనా ఖాన్ గురించి సమంత పోస్ట్.. స్పందించిన బాలీవుడ్ నటి
Samantha: వారియర్ అంటూ హీనా ఖాన్ గురించి సమంత పోస్ట్.. స్పందించిన బాలీవుడ్ నటి

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సినిమా నుంచి ఇంకా బ్రేక్ కొనసాగిస్తున్నారు. మయోసైటిస్‍కు గురైన సమంత చికిత్స కోసం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలోనే మళ్లీ యాక్టింగ్ మొదలుపెట్టున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సామ్ దగ్గరిగానే ఉన్నారు. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నానని బాలీవుడ్ నటి హీనా ఖాన్ ఇటీవల వెల్లడించారు. ఈ విషయంపై సమంత స్పందించారు.

yearly horoscope entry point

ప్రార్థిస్తున్నానంటూ..

హీనా ఖాన్ గురించి నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు సమంత. క్యాన్సర్‌కు ఫస్ట్ కీమోథెరపీ తర్వాత నేరుగా ఓ ఈవెంట్‍కు హాజరయ్యానని హీన్ ఖాన్ ఓ పోస్ట్ చేశారు. దీన్ని షేర్ చేసి సమంత స్పందించారు. “హీనా ఖాన్.. నీ కోసం ప్రార్థిస్తున్నా. వారియర్” అని సమంత ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు.

స్పందించిన హీనా

సమంత పోస్ట్‌కు హీనా ఖాన్ స్పందించారు. జీవితంలో ఎదురైన సవాళ్లను సమంత ఎదుర్కొన్న తీరు అద్భుతమని హీనా పేర్కొన్నారు. “నాకు తెలుసు మీరు గొప్ప స్టార్. జీవితంలో మీకు ఎదురైన వాటిని అద్భుతం కంటే మించి ఎదుర్కొన్నారు” అని హీనా ఖాన్ పోస్ట్ చేశారు.

తాను స్టేజ్-3 బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్)తో బాధపడుతున్నానని హీనా ఖాన్ ఇటీవలే వెల్లడించారు. ఎంతో సవాళ్లతో కూడుకున్న చికిత్స అయినా తాను బాగానే ఉన్నానంటూ ఇన్‍స్టాగ్రామ్ ఓ నోట్ వెల్లడించారు. తనకు చికిత్స ఇప్పటికే ప్రారంభమైందని, అవసరమైనవి చేసేందుకు తాను రెడీ ఉన్నానని తెలిపారు. హీనా ఖాన్ చివరగా నమకూల్ అనే అమెజాన్ మినీ టీవీ సిరిస్‍లో కనిపించారు. మే 17 నుంచి ఆ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.

సమంత తర్వాతి సినిమా

మయోసైటిస్ కారణంగా సుమారు ఏడాదిగా సమంత నటనకు దూరంగా ఉంటున్నారు. చివరగా గతేడాది సెప్టెంబర్‌లో రిలీజైన ఖుషి చిత్రంలో సమంత నటించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహంచిన ఆ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‍గ చేశారు. తనకు ఆరోగ్యం సరిగా లేకున్నా ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక పూర్తిగా బ్రేక్‍లో ఉన్నారు. క్రమంగా కోలుకుంటున్నారు. విదేశాల్లో టూర్లకు వెళుతున్నారు. త్వరలోనే రీ-ఎంట్రీ ఇచ్చేందుకు సమంత రెడీ అవుతున్నారు.

సమంత తన తదుపరి మూవీని ఈ ఏడాది ఏప్రిల్‍లోనే ప్రకటించారు. మా ఇంటి బంగారం టైటిల్‍తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా తీసుకొచ్చారు. గృహిణిగా ఉన్న సమంత గన్ పట్టుకోవడం ఆ పోస్టర్‌లో ఇంట్రెస్టింగ్‍గా అనిపించింది. తాను స్థాపించిన త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి తొలి ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని సమంత నిర్మించనున్నారు. ప్రధాన పాత్ర పోషించనున్నారు. అయితే ఫస్ట్ లుక్ తర్వాత మా ఇంటి బంగారం మూవీ గురించి మరెలాంటి సమాచారం ఇవ్వలేదు సమంత. అప్‍డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ సమంతను వెండితెరపై చూస్తామా అని నిరీక్షిస్తున్నారు. ఇండియన్ వెర్షన్ సిటాడెల్‍: హనీబన్నీలో సమంత ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ ఏడాదిలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.

Whats_app_banner