సమంత రూత్ ప్రభు కొన్నాళ్లుగా డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి అతనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ మధ్య తరచూ రాజ్ ఆమె ఇన్‌స్టా ఫొటోల్లో దర్శనమిస్తున్నాడు. దీంతో వీళ్ల ప్రేమ అఫీషియల్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేయడం విశేషం.
నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ఇప్పటి వరకూ ఒంటరిగానే ఉంది. ఇటు చైతూ మరో పెళ్లి చేసుకున్నా.. సామ్ సింగిల్ గానే కొనసాగుతోంది. అయితే కొన్నాళ్లుగా ఆమె డైరెక్టర్ రాజ్ నిడమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. అతనితో కలిసి తొలిసారి ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో ఆమె పని చేసింది.
ఈ మధ్యకాలంలో వీళ్లు తరచూ జంటగా కనిపిస్తున్నారు. దీంతో ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందన్న పుకార్లు మొదలయ్యాయి. తాజాగా మరోసారి సామ్ చేసిన ఇన్‌స్టా ఫొటోలతో వీళ్ల ప్రేమ నిజమే అన్నట్లుగా కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. రాజ్ తో ఉన్న ఫొటోలతోపాటు ఆమె తన తల్లి నీనెట్టె ప్రభు.. శుభం మూవీలో ఆమె నటనను ప్రశంసిస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది.
తాజాగా శుభం మూవీ సక్సెస్ ను సమంత.. రాజ్ తో సెలబ్రేట్ చేసుకుంది. ఈ సినిమాతోనే ఆమె నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇక రాజ్ ఈ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. “శుభం మూవీని మాతో కలిసి చూసినందుకు, సెలబ్రేట్ చేసుకున్నందుకు థ్యాంక్యూ. కొత్త, తాజా స్టోరీలు అవసరమైన మేము వేసిన తొలి అడుగుతోనే నిరూపితమైంది.
మేము ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్. శుభంతో మా ప్రయాణం మొదలైంది. చాలా అద్భుతంగా ఉంది” అనే క్యాప్షన్ తో ఆమె ఆ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సమంత, రాజ్ కలిసి ఉన్న కొన్నింటిని చూడొచ్చు. వీటిలో ఒకదాంట్లో ఓ విమానంలో రాజ్ భుజంపై సామ్ తల ఆనించి ఓ క్యూట్ పోజు ఇవ్వడం కూడా కనిపిస్తుంది.
సమంత తాజా పోస్టుపై ఫ్యాన్స్ స్పందించారు. “ఇక అఫీషియల్.. రాజ్, సామ్ ప్రేమలో ఉన్నారు” అని ఒకరు కామెంట్ చేశారు. సమంతకు ప్రేమ అవసరమే అని మరికొందరు అన్నారు. ఈ ప్రేమకు నువ్వు అర్హురాలివే అంటూ మరో అభిమాని కామెంట్ చేయడం విశేషం.
శుభం మూవీ ఈ మధ్యే థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. సినిమా బండి మూవీ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. రాజ్ నిడమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నాడు.
సంబంధిత కథనం