Samantha look in Citadel: సిటడెల్ సిరీస్ నుంచి సామ్ ఫస్ట్ లుక్ విడుదల.. స్టైలిష్‌గా ముద్దుగుమ్మ
Samantha look in Citadel: ప్రముఖ బాలీవుడ్ సిరీస్ సిటడెల్ సిరీస్ నుంచి సామ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఈ బ్యూటీ ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. ప్రైమ్ వీడియో వేదికగా విడుదల చేయనుంది.
Samantha look in Citadel: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే రూపొందిస్తున్న సిటడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రబృందం విడుదల చేసింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. సమంతాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో సమంత అదరగొట్టింది. ఈ చిత్రంలో స్టైలిష్‌గా కనిపించింది. బ్రౌన్ లెదర్ జాకెట్, బ్లాక్ జీన్స్, టింటెడ్ గ్లాసెస్ ధరించిన సామ్ చూపరులను ఆకర్షించింది. ఈ ఫొటోను బట్టి చూస్తుంటే ఈమె పాత్ర స్ట్రాంగ్ ఆటిట్యూడ్ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ సిరీస్ క్యారెక్టర్‌ను సామ్ లుక్‌తోనే చూపించారు మేకర్స్.
వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సిటడెల్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదల కానుంది. ఇది రూసో బ్రదర్స్ రూపొందిస్తున్న భారతీయ విభాగం. ఈ సిరీస్‌లో సామ్ ప్రమేయం గురించి అధికారిక ప్రకటన చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. ప్రొడక్షన్ టీమ్‌కు రెండు వారాల టైమ్ లైన్ ఉంది. ఇప్పటికే వరుణ్ ధావన్ తన నాలుగు రోజుల ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న అతడు.. సామ్ లేకుండా ఈ ఘట్టాల్లో పాల్గొన్నాడు.
సిటడెల్ అనేది బాలీవుడ్‌లో స్పై థ్రిల్లర్ జోనర్‌లో రానున్న వెబ్ సిరీస్. ఫ్యామిలీ మెన్ సిరీస్ తెరకెక్కించిన రాజ్ నిడమోరు, కృష్ణ డీకేనే ఈ సిరీస్‌ను కూడా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్ కూడా ప్రైమ్ వీడియోలోనే విడుదలయ్యే అవకాశముంది. సమంతాకు జోడీగా వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. వరుణ్ ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అరంగేట్రం చేయనున్నాడు.
సంబంధిత కథనం