స్టార్ హీరోయిన్ సమంత 38వ పడిలోకి అడుగుపెట్టారు. నేడు (ఏప్రిల్ 28) తన 38వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. 2010లో ఏం మాయ చేశావే సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన సమంత టాప్ హీరోయిన్ రేంజ్‍కు ఎదిగారు. తెలుగు, తమిళంలో చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించారు. ఇప్పటివరకు 45 సినిమాలకుపైగా చేశారు. ప్రస్తుతం బ్రేక్ తీసుకుంటున్నారు. సమంత తన కెరీర్లో కొన్ని చిత్రాల్లో అద్భుతమైన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ప్రేక్షకులకు ఆ పాత్రలు ఎప్పటికీ గుర్తిండిపోయేంత మెప్పించారు. వావ్ అనిపించారు. సమంత సూపర్ పర్ఫార్మెన్స్ చేసిన ఓ 6 సినిమాలు, అవి ఏ ఓటీటీల్లో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
రామ్‍చరణ్ హీరోగా నటించిన రంగస్థలం (2018) చిత్రంలో హీరోయిన్‍గా చేశారు సమంత. ఆ చిత్రంలో రామలక్ష్మి పాత్రలో జీవించేశారు. పల్లెటూరి అమ్మాయిగా గడుసుతనం, అమాయకత్వాన్ని మెప్పించారు. ఈ మూవీలో సమంత పాత్రకు చాలా ప్రశంసలు దక్కాయి. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ రూరల్ యాక్షన్ మూవీ రంగస్థలం భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. ఈ సినిమాను ఇప్పుడు జియో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది.
‘ఓ బేబీ’ (2019) సినిమాలోనూ సమంత యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. దేవుడి వరంతో వృద్ధాప్యం నుంచి యవ్వనానికి వచ్చిన అమ్మాయిగా నటన అదరగొట్టారు సామ్. అమ్మాయిగా ఉన్నా వృద్ధురాలి హావభావాలతో మెప్పించారు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లలోనూ వావ్ అనిపించారు. సమంత కెరీర్లో ఈ మూవీ చాలా స్పెషల్‍గా నిలిచింది. ఓ! బేబీ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఇప్పుడు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూడొచ్చు.
మజిలి (2019) సినిమాలో సమంత నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నాగచైతన్యతో కలిసి ఈ మూవీలో నటించారు ఈ స్టార్ నటి. ఎమోషనల్ డెప్త్ ఉన్న శ్రావణి పాత్రలో సమంత ఈ చిత్రంలో మెప్పించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఆమె యాక్టింగ్ ఓ హైలైట్‍గా నిలిచింది. మజిలి సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.
హీరోయిన్‍గా తన తొలి మూవీ ఏ మాయ చేశావే (2010)తోనే మ్యాజిక్ చేశారు సమంత. క్యూట్ గ్లామరస్ లుక్, నటనతో ఆకట్టుకున్నారు. సమంత చేసిన జెస్సీ పాత్ర ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది. నాగచైతన్య హీరోగా నటించిన ఈ మూవీకి గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. ప్రేమ, ఫ్యామిలీ మధ్య నలిగిలే అమ్మాయి పాత్రలో సమంత మెప్పించారు. ఏ మాయ చేశావే మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. యూట్యూబ్‍లోనూ అందుబాటులో ఉంది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ (2012) సినిమా సమంత యాక్టింగ్ వావ్ అనిపిస్తుంది. క్యూట్‍గా ఉంటూనే ఎమోషనల్‍గా ఆ పాత్ర టర్న్ అవుతుంది. అందుకు తగ్గట్టే తన పర్ఫార్మెన్స్‌తో మెప్పించారు సామ్. ఈగతో మాట్లాడడం, పోరుకు సన్నద్ధం చేయడం ఇలా అన్ని అంశాల్లో ఆకట్టుకున్నారు. ఈగ చిత్రంలో సమంత నటనకు చాలా ప్రశంసలు దక్కాయి. ఈ మూవీలో నాని, సుదీప్ కూడా లీడ్ రోల్స్ చేశారు. ఈగ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.
యశోద (2022) చిత్రంలో యాక్షన్‍తోనూ సమంత అదరగొట్టారు. ఈ మెడికల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఆమె లీడ్ రోల్ చేశారు. సవాళ్లు ఎదుర్కొనే మహిళగా సమంత దుమ్మురేపారు. ఫైట్లతోనూ ఆకట్టుకున్నారు. ఈ సినిమా సక్సెస్‍లో సమంతదే కీలకపాత్ర. యశోద మూవీకి హరి - హరీశ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.
సంబంధిత కథనం