Samantha Comments On Mistakes: స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయమైన సమంత అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలతో యాక్ట్ చేసి అలరించింది.
అక్కినేని నాగ చైతన్యతను ప్రేమ వివాహం చేసుకున్న సమంత అనంతరం నాలుగేళ్లకు విడిపోయిన విషయం తెలిసిందే. చైతూ, సామ్ విడాకులు తీసుకుని ఎవరి కెరీర్‌పై వారు ఫోకస్ పెడుతున్నారు. ఇక మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది. చివరిగా విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో హీరోయిన్‌గా చేసిన సమంత సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటోంది.
ఇటీవల తరచుగా తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్‌లో హాట్ అండ్ బోల్డ్ పిక్స్ పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది సమంత. అయితే, తాజాగా తాను గతంలో చేసిన తప్పుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సామ్. మయోసైటిస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లి వచ్చిన సమంత ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించిన పాడ్‌కాస్ట్ వీడియోలు చేస్తుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దని నెటిజన్స్, ప్రేక్షకులకు అవగాహన కల్పిస్తోంది.
అయితే, ఈ పాడ్‌కాస్ట్‌లో భాగంగా రీసెంట్‌గా సమంతకు ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. "ఇప్పుడు ఇవన్నీ బాగానే చెబుతున్నారు. కానీ, గతంలో మీరే అనారోగ్యకరమైన బ్రాండ్స్‌ను ప్రమోట్ చేశారు కదా" అని సమంతను నెటిజన్ సూటిగా ప్రశ్నించాడు. దానికి సమంత ఇచ్చిన ఆన్సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"గతంలోనే నేను తప్పులు చేసిన మాట నిజమే. కానీ, అవన్నీ పూర్తిగా తెలియక చేసినవి. ఆ తర్వాత అలాంటి అనారోగ్యకర ఉత్పత్తులకు ప్రమోషన్స్ చేయడం పూర్తిగా మానేశాను. ఇప్పుడు ఏదైతో చేస్తున్నానో వాటి గురించి మాత్రమే చెబుతున్నా" అని సమంత పశ్చాత్తాపం చెందినట్లుగా సమాధానం ఇచ్చింది. ఆరోగ్యం పట్ల రిగ్రెట్‌గా ఫీల్ అయిన సామ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని నెటిజన్స్ అంటున్నారు.
అయితే, స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఉన్నప్పుడు సమంత అనేక రకాల బ్రాండ్స్‌కు ప్రచారం చేసింది. వాటిలో కొన్ని హానికర ఉత్పత్తులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే నెటిజన్ అడిగిన ప్రశ్నకు కవర్ చేయకుండా సూటిగా, నిజాయితీగా సమంత నిజం చెప్పింది. కాగా ఈ వ్యాఖ్యలతో సమంత మరోసారి టాలీవుడ్‌లో అందరిదృష్టిని ఆకర్షించింది.
ఇదిలా ఉంటే, సమంత ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్‌కు ప్రీక్వెల్‌గా సమంత సిరీస్ రానుంది. దీనికి సిటాడెల్ హనీ బన్నీ అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో సమంతకు జోడీగా బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్నాడు.
ఈ ఇండియన్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ను ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ వంటి వెబ్ సిరీసులు డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియాంక చోప్రా కంటే ముందు సిటాడెల్‌లో జరిగిన సంఘటనల నేపథ్యంలో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.