ప్రోడ్యూసర్ గా తొలి అడుగునే విభిన్నంగా వేస్తోంది సమంత. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘శుభం’ మూవీని ప్రోడ్యూస్ చేసింది. కంటెంట్ ను నమ్మి ఈ సినిమాను తీసిన సామ్ విజయంపై కాన్ఫిడెంట్ తో ఉంది. ఈ ఫ్యామిలీ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ మే 9న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ డిజిటల్, శాటిలైట్స్ రైట్స్ పై అప్ డేట్ వచ్చింది.
సమంత నిర్మించిన ‘శుభం’ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ ను జీ5 గ్రూప్ దక్కించుకుంది. అంటేఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు జీ5 వేదికగా నిలవనుంది. అలాగే టీవీ విషయానికి వస్తే జీ తెలుగులో ఈ మూవీ టెలికాస్ట్ అవుతుంది. అయితే ముందుగా థియేటర్లలో మే9న ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత మినిమం నాలుగు వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశముంది.
ప్రోడ్యూసర్ గా సమంత జర్నీకి మంచి ఆరంభమే దక్కే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం మంచి డీల్ జరిగినట్లు టాలీవుడ్ టాక్. ఆ డీల్ ఎంతన్నది బయటకు రాలేదు కానీ బిజినెస్ పరంగా చూస్తే సామ్ కు లాభాలు వచ్చాయని సమాచారం. ఇక ఇప్పటికే రిలీజైన శుభం ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేసింది.
శుభం సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ఈ మూవీపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 27న శుభం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా కామెడీతో శుభం ట్రైలర్ సాగింది. రాత్రి పూట సీరియల్ చూస్తే ముగ్గురి ఫ్రెండ్స్ భార్యలు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు.ఊర్లోని మహిళలంతా వింతగా ప్రవర్తిస్తుంటారు. సీరియల్ చూసి చూసి ఆఖరికి దెయ్యాలుగా మారిపోతారు. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు.
అలాంటి తరుణంలో మాతాజీగా సమంత స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చి ట్రైలర్ మీద మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేశారు. ఏం మాట్లాడకుండా భర్తలు అడిగిన ప్రశ్నలకు సైగలతో సమాధానాలు చెబుతూ ట్రైలర్‌ను ఒక రేంజ్‌కు తీసుకెళ్లింది సమంత.
ట్రైలర్‌ను చూస్తే ఈ చిత్రంలో హాస్యం, హారర్, ఉత్కంఠ, ఎమోషన్స్ ఇలా అన్ని రకాల అంశాల్ని జోడించినట్టుగా కనిపిస్తోంది. శుభం మే 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇక వివేక్ సాగర్ అందించిన బీజీఎమ్ స్కోర్, క్లింటన్ సెరెజో సంగీతం ప్రధాన ఆకర్షణ కానుందని శుభం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
సంబంధిత కథనం