Subham Teaser: శోభనం గదిలో టీవీ సీరియల్ ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్‍గా సమంత నిర్మిస్తున్న సినిమా టీజర్-samantha produced subham movie teaser released tv serial twist on wedding night ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Subham Teaser: శోభనం గదిలో టీవీ సీరియల్ ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్‍గా సమంత నిర్మిస్తున్న సినిమా టీజర్

Subham Teaser: శోభనం గదిలో టీవీ సీరియల్ ట్విస్ట్.. ఇంట్రెస్టింగ్‍గా సమంత నిర్మిస్తున్న సినిమా టీజర్

Subham Teaser: శుభం సినిమా టీజర్ వచ్చేసింది. సమంత నిర్మాణంలో ఈ మూవీ వస్తోంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

Subham Teaser: శోభనం గదిలో టీవీ సీరియల్ ట్విస్ట్

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారారు. ఆమె ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పతాకం నుంచి తొలి చిత్రంగా ‘శుభం’ వస్తోంది. ఇటీవలే ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. శుభం చిత్రానికి సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ లీడ్ రోల్స్ చేశారు. శుభం సినిమా టీజర్ నేడు (మార్చి 30) వచ్చేసింది.

టీజర్ ఇలా..

శుభం టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది. కొత్త పెళ్లి కొడుకు (హర్షిత్ రెడ్డి), పెళ్లి కూతురు శ్రీవల్లి (శ్రీయా) శోభనం గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. “మా వాడు అమాయకుడు, మొత్తం నువ్వే చూసుకోవాలని మీ అమ్మ చెప్పారు” అని అతడితో శ్రీవల్లి అంటుంది. తాను ధైర్యవంతుడినని చెప్పేందుకు డైలాగ్‍లు చెబుతాడు హర్షిత్. ఇంతలో రిమోట్‍ తీసుకొని టీవీ ఆన్ చేస్తుంది అమ్మాయి. దీంతో ట్విస్ట్ ఎదురవుతుంది. శోభనం గదిలోనే సీరియల్స్ చూస్తూనే ఉంటుంది శ్రీవల్లి. ఇప్పుడు సీరియల్ చూడడం ఏంటి అని హర్షిత్ అంటే.. ఉష్ అంటూ సీరియస్‍గా అంటుంది శ్రీవల్లి. దీంతో అతడు బెదిరిపోతాడు. టీవీ సీరియల్స్ చూసి భర్తను శ్రీవల్లి ఆటాడుకుంటుందనేలా సీన్స్ ఉన్నాయి. ఆల్ఫా పురుషుడు కాకపోతే భార్య వదిలివెళ్లిపోతుందని హర్షిత్‍ను స్నేహితులు బెదిస్తారు. దీంతో శుభం టీజర్ ముగిసింది.

సీరియల్స్ పిచ్చి ఉన్న భార్యతో భర్త పడే ఇబ్బందుల చుట్టూ శుభం సీరియల్ సాగుతుందనేలా టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ మూవీకి ‘చచ్చినా చూడాల్సిందేననే’ ట్యాగ్‍లైన్ కూడా ఉంది. మొత్తంగా ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది.

సినిమాబండి మూవీతో ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుడటంతో శుభం చిత్రంపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. సమంత నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రం కావడం కూడా స్పెషాలిటీగా ఉంది. ఈ చిత్రానికి వసంత్ మారిగంటి కథ అందించారు.

షూటింగ్ ఫినిష్

శుభం చిత్రంలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, శ్రీనివాస్‍తో పాటు చరణ్ పేరి, శ్రావణి లక్ష్మి, షాలినీ కొండేపూడి, వంశీధర్ గౌడ్ కీలకపాత్రలు పోషించారు. క్లింటన్ సెరెజో ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్‍ ఇంకా ఖరారు కాలేదు. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది.

మా ఇంటి బంగారం చిత్రాన్ని కూడా గతంలోనే సమంత ప్రకటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు ఆమెనే నిర్మిస్తున్నారు. సమంత గన్ పట్టుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇంట్రెస్ట్ పెంచింది. అయితే, ఈ సినిమాపై ఆ తర్వాత అప్‍డేట్స్ రాలేదు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం