Samantha Opt Out Bollywood Web Series: బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి తప్పుకున్న సమంత - కారణం ఇదేనా
Samantha Opt Out Bollywood Web Series: అనారోగ్య సమస్యలతో రాజ్‌డీకే దర్శకత్వంలో రూపొందుతోన్న బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి సమంత వైదొలిగినట్లు ప్రచారం జరుగుతోంది.
Samantha Opt Out Bollywood Web Series: అనారోగ్య సమస్యలతో బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి సమంత తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. రెండు నెలల క్రితం తాను మయోసైటిస్ బారిన పడినట్లు సమంత పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా యశోద ప్రమోషన్స్‌తో పాటు సినిమా షూటింగ్‌లకు కొన్నాళ్లుగా దూరంగా ఉంటోంది సమంత.
ట్రెండింగ్ వార్తలు
ప్రస్తుతం ఫ్యామిలీమ్యాన్ -2 తో తనను బాలీవుడ్‌కు పరిచయం చేసిన దర్శకద్వయం రాజ్ డీకేలతో హిందీలో వెబ్‌సిరీస్ చేస్తోంది సమంత. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో సమంత స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నది. త్వరలోనే షూటింగ్‌ను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తోన్నారు.
అనూహ్యంగా సమంత మయోసైటిస్ బారిన పడటంతో షూటింగ్‌ను వాయిదావేశారు. తాజాగా ఈ సిరీస్ నుంచి సమంత తప్పుకోన్నట్లు బాలీవుడ్ సర్కిల్‌లో ప్రచారం జరుగుతోంది. మయోసైటిస్ నుంచి సమంత పూర్తిగా కోలుకోవడానికి మరో మూడు, నాలుగు నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించినట్లు సమాచారం. అప్పటివరకు సమంత షూటింగ్‌లలో పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు.
అనారోగ్య సమస్యల వల్లే బాలీవుడ్ వెబ్‌సిరీస్ నుంచి సమంత తప్పుకుందని అంటున్నారు. ఈ సిరీస్‌లో సమంతతో పాటు బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్ కీలక పాత్ర పోషిస్తోన్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటోన్న సమంత లాంగ్ గ్యాప్ తర్వాత సోమవారం అభిమానులతో ముచ్చటించింది.
మయోసైటిస్ కారణంగా జీవితం గతం కంటే చాలా భిన్నంగా మారిపోయిందని పేర్కొన్నది. నూతనోత్తేజంతో తిరిగి అందరి ముందుకు వస్తానని వెల్లడించింది. కాగా సమంత హీరోయిన్‌గా నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ అవుతోంది.