Samantha: హాస్పిటల్ బెడ్‌పై సమంత- నాగ చైతన్య, శోభితా ఫొటోలపై సామ్ ఫ్యాన్స్ సెటైర్లు- తోబుట్టువులా కనిపిస్తారంటూ!-samantha in hospital bed again and samantha ruth prabhu fans comments on naga chaitanya sobhita dhulipala pics at madras ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: హాస్పిటల్ బెడ్‌పై సమంత- నాగ చైతన్య, శోభితా ఫొటోలపై సామ్ ఫ్యాన్స్ సెటైర్లు- తోబుట్టువులా కనిపిస్తారంటూ!

Samantha: హాస్పిటల్ బెడ్‌పై సమంత- నాగ చైతన్య, శోభితా ఫొటోలపై సామ్ ఫ్యాన్స్ సెటైర్లు- తోబుట్టువులా కనిపిస్తారంటూ!

Sanjiv Kumar HT Telugu

Samantha In Hospital And Her Fans On Naga Chaitanya Sobhita Pics: సమంత మరోసారి హాస్పిటల్ బెడ్‌పై కనిపించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో సామ్‌కు ఏమైందని ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. మరోవైపు నాగ చైతన్య, శోభితా ధూళిపాళ లేటెస్ట్ ఫొటోలపై సామ్ ఫ్యాన్స్ సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

హాస్పిటల్ బెడ్‌పై సమంత- నాగ చైతన్య, శోభితా ఫొటోలపై సామ్ ఫ్యాన్స్ సెటైర్లు- తోబుట్టువులా కనిపిస్తారంటూ!

Samantha In Hospital Bed And Fans Worried: స్టార్ హీరోయిన్ సమంత మరోసారి హాస్పిటల్‌లో చేరింది. ఇదివరకే మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత మెరుగైన చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, అప్పుడప్పుడు ఇలా హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ తన గురించి ఫ్యాన్స్‌కు తెలిసేలా చేస్తుంటుంది సామ్.

త్వరగా కోలుకోవాలని

తాజాగా అలాగే, తను షేర్ చేసిన కొన్ని ఫొటోల్లో హాస్పిటల్ బెడ్‌పై సమంత ఉంది. వైట్ కలర్ టీ షర్ట్‌లో ఆస్పత్రి బెడ్‌పై సమంత ఉన్న ఫొటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాంతో సమంతకు మళ్లీ ఏమైందని ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని సామ్ ఫ్యాన్స్‌తోపాటు నెటిజన్స్ కూడా ఆ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

కొత్త పెళ్లి జంట చక్కర్లు

ఇదిలా ఉంటే, మరోవైపు కొత్త పెళ్లి జంట నాగ చైతన్య, శోభితా ధూళిపాళ టూర్‌లతో చక్కర్లు కొడుతున్నారు. నాగ చైతన్య-శోభితా పెళ్లిపై ఇప్పటికీ అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తమిళనాడు కాంచీపురంలోని మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో సందడి చేశారు నాగ చైనత్య, శోభితా ధూళిపాళ.

సూపర్ గార్జియస్ కపుల్

అంతేకాకుండా మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నాగ చైతన్యతో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో శోభితా ధూళిపాళ షేర్ చేసింది. ఇప్పుడు ఇవి కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్స్ ఆ ఫొటోలకు "క్యూట్", "లవ్", "సూపర్ గార్జియస్ కపుల్" అని పొగుడుతూ కామెంట్స్ చేశారు. కానీ, కొంతమంది నెగెటివ్ కామెంట్స్ పెట్టారు.

ఒక్కటైన సమంత అభిమానులు

"సమంత రెస్పెక్ట్ బటన్", "సమంత ఫ్యాన్స్ అసెంబుల్ (ఒక్కటవ్వండి)", "జీరో కెమిస్ట్రీ. తోబుట్టువులా కనిపిస్తారు, అలాగే ప్రవర్తిస్తారు", ఈ ఫొటోలపై సమంత స్పందించాలి", "ఎప్పటికీ సామ్ బేబీనే", "ఎప్పటికీ సమంత ఫ్యాన్సే", "తల్లీకొడుకు" అంటూ సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే, నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోవడంపై సామ్ అభిమానులు కాస్తా కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నెగెటివ్ కామెంట్స్

అందుకే సమంతకు సపోర్ట్ చేస్తూ నాగ చైతన్య-శోభితా ధూళిపాళ ఫొటోలపై ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఓవైపు సమంత ఆస్పత్రి బెడ్‌పై ఉండటం, మరోవైపు నాగ చైతన్య, శోభితా ఫొటోలపై నెటిజన్స్ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఈ ముగ్గురు టాపిక్, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

స్టైలిష్‌గా శోభితా

ఇదిలా ఉంటే, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో నాగ చైతన్యతో కలిసి ఫొటోలు దిగడమే కాకుండా శోభితా రేస్ ట్రాక్‌పై రేస్ కారును డ్రైవ్ చేసింది. ఈ ఫొటోల్లో నాగ చైతన్య వైట్ టీ షర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని టోపీ, సన్ గ్లాసెస్ పెట్టుకుని పోజులిచ్చాడు. ఇక శోభితా ధూళిపాళ బ్లాక్ క్రాప్ టాప్, ఆలీవ్ గ్రీన్ ప్యాంట్‌ వేసుకును క్యాజువల్ లుక్‌లో స్టైలిష్‌గా కనిపించింది.

Sobhita Dhulipala's Instagram post
Sobhita Dhulipala's Instagram post
నాగ చైతన్య-శోభితా ధూళిపాళ ఫొటోలపై సమంత ఫ్యాన్స్ కామెంట్స్
నాగ చైతన్య-శోభితా ధూళిపాళ ఫొటోలపై సమంత ఫ్యాన్స్ కామెంట్స్

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం