Double Trouble OTT: ఓటీటీలోకి వచ్చేసిన డబుల్ ట్రబుల్ - సమంత, నయనతార కామెడీ మూవీని ఎందులో చూడాలంటే?
Double Trouble OTT: విజయ్ సేతుపతి, నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన కాథు వకుల రెండు కాదల్ హిందీ వెర్షన్ ఓటీటీలో రిలీజైంది. డబుల్ ట్రబుల్ పేరుతో జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Double Trouble OTT: సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన కాథు వకుల రెండు కాదల్ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీలో రిలీజైంది. డబుల్ ట్రబుల్ పేరుతో జియో సినిమా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. గురువారం డబుల్ ట్రబుల్ విడుదలైనట్లు జియో సినిమా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. సినిమా పోస్టర్‌ను పంచుకున్నది. 2022లో తమిళంలో ఈ మూవీ రిలీజైంది. దాదాపు రెండేళ్ల తర్వాత హిందీ వెర్షన్ ఓటీటీలోకి రావడం గమనార్హం.
నయనతార ప్రొడ్యూసర్...
కాథు వకుల రెండు కాదల్ మూవీకి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించాడు. నయనతార స్వయంగా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి ముందు విజయ్ సేతుపతి వరుస విజయాల్లో ఉండటం, సౌత్‌లో అగ్ర కథానాయికలైన సమంత, నయనతార ఫస్ట్ టైమ్ కలిసి స్క్రీన్‌పై కనిపించడంతో రిలీజ్‌కు ముందు కాథు వకుల రెండు కాదల్ మూవీపై తమిళంలో మంచి బజ్ ఏర్పడింది.
కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. హీరోహీరోయిన్ల నటన బాగున్నా...కథలో కొత్తదనం మిస్సయిందని, కామెడీ ఆశించిన స్థాయిలో పండలేదంటూ విమర్శలొచ్చాయి. ఈ నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా కమర్షియల్‌గా కాథు వకుల రెండు కాదల్ మూవీ 70 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి కమర్షియల్ హిట్‌గా నిలిచింది.
ఇద్దరు అమ్మాయిలతో ప్రేమ...
రాంబో (విజయ్ సేతుపతి) తనను తాను దురదృష్టవంతుడిగా భావిస్తుంటాడు. అతడు ఏది కోరుకున్నా అది జరగదు. అతడి ఫ్యామిలీకి ఉన్న శాపం కారణంగా పెళ్లి విషయంలో రాంబోకు ఎన్నో అడ్డంకులు ఎదురవుతుంటారు. పగలు క్యాబ్ డ్రైవర్‌గా, రాత్రి ఓ పబ్‌లో బౌన్సర్‌గా పనిచేసే రాంబో జీవితంలో కణ్మణి (నయనతార), ఖతీజా(సమంత) ఎలా వచ్చారు? ఈ ఇద్దరిని రాంబో ప్రేమించడానికి కారణం ఏమిటి? కణ్మణి, ఖతీజా రాకతో రాంబో లైఫ్ ఎలా మారిపోయింది? అన్నదే కాథు వకుల రెండు కాదల్ మూవీ కథ.
కాథు వకుల రెండు కాదల్ మూవీ తెలుగులో కణ్మణి రాంబో ఖతీజా (కేఆర్‌కే) పేరుతో డబ్ అయ్యింది. తెలుగులో ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
సినిమాలకు గ్యాప్...
తెలుగులో ఖుషి తర్వాత ఏడాదిపైనే సినిమాలకు గ్యాప్ తీసుకున్నది సమంత.ఇటీవలే తన బర్త్‌డే రోజు మా ఇంటి బంగారం పేరుతో ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీని అనౌన్స్‌చేసింది. ఈ సినిమానే తానే స్వయంగా నిర్మించబోతున్నట్లు సమంత ప్రకటించింది. త్వరలోనే మా ఇంటి బంగారం మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం.
సిటాడెల్ వెబ్‌సిరీస్...
సమంత లీడ్ రోల్‌లో నటించిన సిటాడెల్ హిందీ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జూలై లేదా ఆగస్ట్ నుంచి ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సిరీస్‌కు రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దర్శకద్వయం తెరకెక్కించిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌తోనే సమంత బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.