Samantha: అందుకు స్టెరాయిడ్స్ తీసుకున్న సమంత.. మారిపోయిన ముఖం.. ఫొటో వైరల్
Samantha About Steroids: బ్యూటిఫుల్ సమంత ఇటీవల ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లింది. అయితే తన వ్యాధికి సంబంధించి తాజాగా షాకింగ్ విషయం చెప్పింది.
ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటిఫుల్ సమంత తర్వాతి కాలంలో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. ఇటీవల ఆమె నటించిన యశోద మంచి హిట్ కాగా.. శాకుంతలం మాత్రం డిజాస్టర్‍గా నిలిచింది. ఇక విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన ఖుషి మూవీ మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పటికే తను సైన్ చేసిన సినిమాలన్నింటిని పూర్తి చేసిన సమంత ప్రస్తుతం అమెరికా వెళ్లింది. అమెరికాలో కొన్ని నెలలపాటు ఉండనున్న సామ్ తన మయోసైటిస్ (Myositis) వ్యాధికి చికిత్స తీసుకోనుంది.
మూడ్‍లో ఉన్నానంటూ
మయోసైటిస్ చికిత్స కోసమే సమంత అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఇండియాకు రానుంది. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉండే సమంత ఈ మధ్య తరచుగా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులు, నెటిజన్లకు టచ్‍లో ఉంటోంది. అందులో ఎక్కువగా జిమ్ పిక్స్, టూర్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. ఇక తాజాగా మాట్లాడేందుకు మూడ్‍లో ఉన్నానంటూ చాటింగ్ సెషన్ నిర్వహించింది.
గ్లాసీగా చేస్తానని
ఈ ఇన్ స్టా చాటింగ్ సెషన్‍లో నెటిజన్లు, అభిమానులు అడిగిన వివిధ ప్రశ్నలకు సామ్ సమాధానాలు ఇచ్చింది. వాటిలో ఒకరు "మీ స్కిన్ ఎందుకు అంత క్లీన్‍గా (గ్లో వచ్చిందన్న అర్థంలో) ఉంది" అని అడిగారు. దానికి లేదు. మీరు అనుకున్నట్లు ఏం లేదు. నన్ను చిన్మయి గ్లాసీగా తయారు చేస్తానని చెప్పింది. గ్లాసీగా చేస్తుందట" అంటూ కళ్లు ఎగరేస్తూ సమంత చెప్పింది.
స్టెరాయిడ్స్ షాట్స్
సమంత అలాగే కొనసాగిస్తూ "నిజానికి నేను మయోసైటిస్ చికిత్సలో భాగంగా చాలా స్టెరాయిడ్స్ తీసుకున్నాను. స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకుంటున్నాను. దీంతో కొంచెం చర్మ సంబంధిత సమస్యలు (pigmentation) వస్తున్నాయి. వాటితో చాలా ఇబ్బంది పడుతున్నాను. ఫేస్‍లో చేంజ్ వచ్చింది. నేను ఇప్పుడు దీనికోసం ఫిల్టర్ వాడాను. అందుకే క్లీన్‍గా కనిపిస్తుంది" అని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో, ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.