హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి నిర్మించిన లేటెస్ట్ మూవీ శుభం. హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన శుభం సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో సమంతతోపాటు మూవీ టీమ్ అభిమానులను, ఆడియెన్స్‌ను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం (మే 16) శుభం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమంత ఇంట్రెస్టింగ్ విశేషాలు చెబుతూ కామెంట్స్ చేసింది.
నటి, నిర్మాత సమంత మాట్లాడుతూ .. "పది శాతం సక్సెస్ రేట్ ఉన్న ఈ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చానా? అన్నది ఇప్పుడు నాకు అర్థం అవుతోంది. ‘శుభం’ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరి దగ్గర నవ్వులు, సంతోషం కనిపిస్తోంది. ఇదే అసలైన సక్సెస్. ఇలాంటి ఆనందం చూడటానికే నిర్మాతలు ఇంకా ఇంకా సినిమాలు తీస్తూనే ఉంటారు" అని చెప్పింది.
"నాకు ఈ మూవీ చూస్తే నా సమ్మర్ హాలీడేస్ గుర్తుకు వచ్చాయి. పిల్లల్ని సినిమాలకు తీసుకు వెళ్లేందుకు మా అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. ఓ మూవీని మా ఫ్యామిలీ అంతా కలిసి చూసిన రోజులన్నీ నాకు మళ్లీ గుర్తుకు వచ్చాయి. అవన్నీ నిన్నే జరిగినట్టుగా అనిపించాయి. ‘శుభం’తో అందరినీ మళ్లీ పాత రోజుల్లోకి తీసుకెళ్లాం" అని సమంత తెలిపింది.
"మేం ఇలాంటి మంచి చిత్రాలను తీసి ఫ్యామిలీస్‌ను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటాం. మీ తీపి జ్ఞాపకాల్ని మళ్లీ మీకు గుర్తు చేస్తూనే ఉంటాం.. అదే మా ట్రాలాలా లక్ష్యం. దాని కోసం ఎంతైనా కష్టపడుతూనే ఉంటాం. నటిగా ఉంటే లాస్ట్‌గా వస్తాం.. ఫస్ట్ వెళ్లిపోతాం. హీరోయిన్‌గా ఉన్నప్పుడు కేవలం నా పాత్ర గురించే ఆలోచించేదాన్ని. కానీ నిర్మాతగా అసలు కష్టాల్ని తెలుసుకున్నాను. సినిమా రిలీజ్‌కు ముందు మూడు రోజులు ఏ ఒక్కరూ నిద్రపోలేదు. అంతలా కష్టపడ్డ నా టీంకు సక్సెస్ రావాలని, క్రెడిట్ దక్కాలని కోరుకున్నాను. ఇప్పుడు వస్తున్న ప్రేమ, అభిమానం, ప్రశంసలు అన్నింటికీ వాళ్లే కారణం" అని సమంత పేర్కొంది.
"రాజ్ అండ్ హిమాంగ్‌లే ట్రాలాలా బ్యాక్ బోన్‌లా నిలుచున్నారు. ప్రవీణ్ చాలా మంచి వ్యక్తి. ఆయనెప్పుడూ ట్రాలాలాలో ఓ భాగం. వసంత్ ఎప్పుడూ మా బ్యానర్‌లో భాగస్వామి. ఎడిటర్ ధర్మేంద్ర గారికి థాంక్స్. వివేక్ సాగర్ గారు తన బీజీఎంతో ప్రాణం పోశారు. క్లింటన్ గారి పాటలు అందరినీ మెప్పిస్తున్నాయి. డైరెక్షన్ టీం అందరికీ థాంక్స్. రామ్ ఆర్ట్ వర్క్, లేడీ కెమెరామెన్ మృదుల్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాకేష్‌కి థాంక్స్" అని సమంత చెప్పింది.
"ఆర్య అయితే నా కెరీర్ నుంచి అండగానే నిలుస్తున్నారు. ఈ మూవీ గురువారం రిలీజ్ అయింది. మీడియా నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది. మీడియా వల్లే మా మూవీ జనాల్లోకి ఎక్కువగా రీచ్ అయింది. మా చిత్రాన్ని ఇంతలా సపోర్ట్ చేసిన మీడియాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాకు సపోర్ట్‌గా నిలిచిన మైత్రి శశి, సురేష్ బాబు గారికి థాంక్స్. అభిమానులే నా ప్రపంచం. ‘శుభం’ సినిమాను ముందుకు తీసుకెళ్తున్న అభిమానులకు థాంక్స్. ఈ సినిమాలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్" అని సమంత రూత్ ప్రభు స్పీచ్ ముగించింది.
సంబంధిత కథనం