Samantha: జైల్లో పెట్టాలన్న డాక్టర్ వార్నింగ్‌పై సమంత వివరణ.. కౌంటర్ ఇచ్చిన హీరో-samantha clarification on nebuliser using post after doctor warning samantha ruth prabhu explanation on nebuliser post ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: జైల్లో పెట్టాలన్న డాక్టర్ వార్నింగ్‌పై సమంత వివరణ.. కౌంటర్ ఇచ్చిన హీరో

Samantha: జైల్లో పెట్టాలన్న డాక్టర్ వార్నింగ్‌పై సమంత వివరణ.. కౌంటర్ ఇచ్చిన హీరో

Sanjiv Kumar HT Telugu
Jul 05, 2024 01:02 PM IST

Samantha Clarification On Doctors Warning: హీరోయిన్ సమంత, వైద్యుల విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సమంత పెట్టిన పోస్టుపై మండిపడిన వైద్యులు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ఓ హీరో కౌంటర్ ఇవ్వగా.. తాజాగా సమంత వివరణ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

జైల్లో పెట్టాలన్న డాక్టర్ వార్నింగ్‌పై సమంత వివరణ.. కౌంటర్ ఇచ్చిన హీరో
జైల్లో పెట్టాలన్న డాక్టర్ వార్నింగ్‌పై సమంత వివరణ.. కౌంటర్ ఇచ్చిన హీరో

Samantha Explanation On Doctor Warning: ఈ మధ్య సమంత సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. తరచుగా ఏదో ఒక పోస్ట్, ఫొటో పెడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల నెబులైజర్ వాడకంపై పోస్ట్ చేసింది సమంత. దీనిపై వైద్యుల నుంచి సర్వత్రా విమర్శలు వచ్చాయి.

"మాములు వైరల్ ఇన్‌ఫెక్షన్ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యమ్నాయ మందులు వాడండి. అందులో ఒకటి హైడ్రోజన్ పెరాక్సైడ్, డిస్టిల్ట్ వాటర్ రెండూ కలిపి నెబులైజర్ చేయండి. ఇది అద్భుతంగా పని చేస్తుంది. అనవసరంగా ట్యాబ్లెట్స్ వాడకుండా ఇలా ప్రయత్నించండి" అని సమంత తన పోస్టులో రాసుకొచ్చింది. అంతేకాకుండా దీన్ని తనకు మిత్ర బసు చిల్లర్ అనే వైద్యురాలు సలహా ఇచ్చినట్లుగా ఆమెను ట్యాగ్ కూడా చేసింది.

ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. ఇది చూసిన పలువురు డాక్టర్స్ మండిపడ్డారు. సమంతపై సీరియస్ అయ్యారు. సమంత ఇచ్చిన హెల్త్ టిప్ తప్పు అని, ఇలా చేస్తే చనిపోయే అవకాశం కూడా ఉందని డాక్టర్ సిరియాక్ ఆబీ ఫిలిప్స్ అకా లివర్ డాక్టర్ హెచ్చరించారు. అంతేకాకుండా సమంతను హెల్త్ గురించి, సైన్స్ గురించి తెలియని నిరక్షరాస్యురాలని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నందుకు ఆమెను జైలులో పెట్టాలని, లేదా జరిమానా విధించాలని వార్నింగ్ ఇచ్చారు.

డాక్టర్ రిప్లైకి హీరో, డైరెక్టర్, సమంత ఫ్రెండ్ అయిన రాహుల్ రవీంద్రన్ కౌంటర్ ఇచ్చాడు. "ఈ విషయం గురించి సమంత ట్యాగ్ చేసిన డాక్టర్‌తో వాదిస్తే మంచిది" అని సమంతకు రాహుల్ రవీంద్రను మద్దతుగా నిలిచాడు. డాక్టర్‌కు కౌంటర్ ఇస్తూ తన స్నేహితురాలికి అండగా నిలిచాడు రాహుల్ రవీంద్రన్. ఇక తాజాగా డాక్టర్ వార్నింగ్‌పై సమంత రియాక్ట్ అయింది. తన పోస్టుకు వివరణ ఇస్తూ ఇన్‌స్టా గ్రామ్‌లో లాంగ్ నోట్ రాసుకొచ్చింది.

"గత కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకోవాల్సి వచ్చింది. నేను డాక్టర్స్ ఇచ్చిన ప్రతి సలహాను గట్టిగా ప్రయత్నించాను. ఉన్నత విద్యావంతులైన నిపుణుల సలహా మేరకు, వీలైనంత స్వీయ పరిశోధన చేసిన తర్వాతే ఇలాంటి టిప్స్ పాటించాను. ఈ చికిత్సలు చాలా ఖరీదైనవి కూడా. నేను దానిని భరించగలిగినందుకు నేను ఎంత అదృష్టవంతురాలిని. కానీ సామాన్యుల పరిస్థితుల వేరు" అని సమంత తెలిపింది.

"ఇలాంటి ఖరీదైన ట్రీట్‌మెంట్ తీసుకోలేని వారి గురించే నేను ఆలోచించాను. చాలా కాలం వరకు, సాంప్రదాయ చికిత్సలు నన్ను మెరుగుపరచలేదు. ఈ రెండు అంశాలు నన్ను అల్టర్‌నేటివ్ ట్రీట్‌మెంట్ గురించి ఆలోచించేందుకు కారణం అయ్యాయి. ఆ తర్వాత నాకు అద్భుతంగా పనిచేసే చికిత్సలను నేను కనుగొన్నాను. ఇవి నేను ఖర్చు చేసిన దాంట్లో కొంతవరకు మాత్రమే ఖర్చు అవుతాయి" అని సమంత పేర్కొంది.

"ఒక ట్రీట్‌మెంట్ గురించి పూర్తిగా తెలుసోకుండా సలహా ఇచ్చేంత అమాయకురాలిని నేను కాదు. గత కొన్నేళ్లుగా నేను ఎదుర్కొన్న, నేర్చుకున్న విషయాలన్నింటి ప్రకారంగానే మంచి ఉద్దేశ్యంతో ఈ సలహా సూచించాను. ముఖ్యంగా అత్యంత ఖర్చుతో కూడుకున్న చికిత్సల కారణంగా చాలామంది ఆర్థికంగా చితికిపోతున్నారు. చాలామంది వాటిని భరించలేకపోవచ్చు. ఏది ఏమైనా మనం చివరకు విద్యావంతులైన వైద్యుల మార్గనిర్దేశంతోనే సలహాలు పాటిస్తున్నాం" అని సమంత చెప్పుకొచ్చింది.

"25 ఏళ్లుగా డీఆర్డీవోకు సేవలందించిన, ఎండీ అర్హత కలిగిన డాక్టరే నాకు ఈ చికిత్సను సూచించారు. సంప్రదాయ వైద్యంలో విద్యాభ్యాసం చేసిన తర్వాత ఈ ప్రత్యామ్నాయ చికిత్సను తెలిపారు. ఒక పెద్దమనిషి నా పోస్టును, నా ఉద్దేశాలను చాలా బలమైన పదాలతో దూషించాడు. ఆ పెద్దమనిషి కూడా డాక్టర్ అని చెప్పారు. నాకంటే ఆయనకే ఎక్కువ తెలుసు అనడంలో సందేహం లేదు. అతని ఉద్దేశాలు ఉదాత్తమైనవని నేను కచ్చితంగా అనుకుంటున్నాను" అని సమంత అన్నారు.

"ఆయన తన మాటలతో అంత రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకపోయి ఉంటే ఆయన పట్ల దయ, కరుణ ఉండేది. ముఖ్యంగా నన్ను జైల్లో పెట్టాలని ఆయన సూచించినందుకు ఏమీ అనుకోను. ఇది సెలబ్రిటీ అనే పాత్రతో ముడిపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సెలబ్రిటీగా కాకుండా వైద్య చికిత్సలు అవసరమైన వ్యక్తిగా పోస్ట్ చేశాను. నన్ను టార్గెట్ చేయడం కంటే నేను ట్యాగ్ చేసిన డాక్టర్‌తో డిబేట్ చేసి ఉంటే బాగుండేది" అని సామ్ చెప్పకొచ్చింది.

Whats_app_banner