Samantha: బ్యాక్ టూ వర్క్ - బాలీవుడ్ వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ మొదలుపెట్టిన సమంత - ఫొటోలు వైరల్
Samantha: లాంగ్ గ్యాప్ తర్వాత సమంత మళ్లీ డబ్బింగ్ స్టూడియోలో దర్శనమిచ్చింది. రాజ్‌డీకే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సిటాడెల్ హిందీ వెబ్‌సిరీస్‌కు డబ్బింగ్ చెబుతోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది.
Samantha: మయోసైటిస్ కారణంగా ఏడాదిపాటు కెరీర్‌కు లాంగ్ బ్రేక్ తీసుకున్న సమంత అభిమానులకు గుడ్‌న్యూస్ వినిపించింది. తొందరలోనే బాలీవుడ్ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. సిటాడెట్ హిందీ వెర్షన్ వెబ్‌సిరీస్ డబ్బింగ్ మొదలుపెట్టింది.
డబ్బింగ్ స్టూడియోలో తన పాత్రకు డబ్బింగ్ చెబుతోన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. హిందీ సిరీస్ రషెస్ చూశానని, చాలా బాగా వచ్చాయంటూ ఓ పోస్ట్‌పెట్టింది. వరుణ్‌ధావన్, డైరెక్టర్స్ రాజ్‌డీకేలతో కలిసి దిగిన ఫోట్‌ను షేర్ చేసింది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సమంత రీఎంట్రీతో ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.
గూఢచారి పాత్రలో...
సిటాడెట్ హిందీ వెబ్‌సిరీస్‌లో సమంత యాక్షన్ ఓరియెంటెడ్ రోల్ చేసింది. ఇందులో గూఢచారి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన సిటాడెల్ వెబ్‌సిరీస్ ఆధారంగా ఈ ఇండియన్ సిరీస్ తెరకెక్కుతోంది. ఇందులో సమంతతో పాటు వరుణ్‌ధావన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా రోజుల క్రితమే సిటాడెట్ షూటింగ్ పూర్తయింది. ఇన్నాళ్లు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరిపారు. డబ్బింగ్ పూర్తిచేసి ఏప్రిల్ లేదా మే నెలలో ఈ సిరీస్‌ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
ఫ్యామిలీ మ్యాన్‌తో బాలీవుడ్ ఎంట్రీ...
గతంలో రాజ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ 2లో నెగెటివ్ షేడ్స్ పాత్రలో సమంత నటించింది. ఫ్యామిలీ మ్యాన్ 2తోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి అడుగులోనే విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను అందుకున్నది. సినిమాల్లో అవకాశాలు వచ్చినా కాదని మరోసారి హిందీలో సిటాడెల్ హిందీ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ మ్యాన్ 2కు మించి ఛాలెంజింగ్‌గా సిటాడెల్ సిరీస్‌లో సమంత క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం.
సమంత రీఎంట్రీ...
సిటాడెల్ షూటింగ్ పూర్తిచేసిన తర్వాతే సినిమాలకు గ్యాప్ తీసుకుంటున్నట్లు సమంత ప్రకటించింది. మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకునే వరకు సినిమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నది. తాను అంగీకరించిన కొన్ని సినిమాలను వదులుకున్నది. ప్రస్తుతం సమంత పూర్తిగా రికవరీ అయినట్లు సమాచారం. సిటాడెట్ పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ పనులతోనే మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
ఖుషి...శాకుంతలం...
గత ఏడాది ఖుషి, శాకుంతలం సినిమాలు చేసింది సమంత. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఖుషి మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. విజయ్ దేవరకొండ, సమంత కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో మోస్తారు వసూళ్లతోనే ఈ మూవీ సరిపెట్టుకున్నది.
చారిత్రక కథాంశంతో తెరకెక్కిన శాకుంతలం మాత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ 20 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. మహాభారతంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాధతో త్రీడీలో దర్శకుడు గుణశేఖర్ శాకుంతలం మూవీని తెరకెక్కించాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ మైథాలజీ మూవీ ఇదే. కానీ ఈ ప్రయోగం సామ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టలేకపోయింది.