Salman Khan: సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించిన సికందర్ మూవీ ట్రైలర్ ఆదివారం రిలీజైంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది.
ఆదివారం ముంబాయిలో సికందర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రష్మిక మందన్నతో ఏజ్ గ్యాప్‌పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సల్మాన్ ఖాన్ కంటే రష్మిక మందన్న 31 ఏళ్లు చిన్నది అంటూ సోషల్ మీడియాలో కొన్నాళ్లుగా ట్రోల్స్ వస్తోన్నాయి.
ఈ ట్రోల్స్‌పై ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో సల్మాన్ ఖాన్ రియాక్ట్ అయ్యాడు. ఏజ్ గ్యాప్ విషయంలో రష్మికకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు. ఆమె తండ్రికి కూడా సమస్య లేదు. వాళ్లకే లేని సమస్య మీకు ఎందుకు? అంటూ ఫన్నీగా కామెంట్స్ చేశాడు. రష్మికకు పెళ్లైనా కూడా ఆమెతో కలిసి నటిసా..అంతే కాదు రష్మికకు ఓ కూతురు పుడితే తనతో కూడా సినిమాలు చేస్తా అంటూ సల్మాన్ ఖాన్ కౌంటర్ ఇచ్చాడు.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో రష్మిక మందన్న అంకితభావంపై సల్మాన్ ఖాన్ ప్రశంసలు కురిపించాడు. పుష్ప 2తో పాటు సికిందర్ సినిమాల షూటింగ్‌లలో ఒకేసారి రష్మిక మందన్న పాల్గొన్నదని చెప్పాడు.
డే టైమ్‌లో పుష్ప 2 షూటింగ్ పూర్తిచేసుకొని నైట్ టైమ్ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరున్నర వరకు సికందర్ షూటింగ్‌లో రష్మిక మందన్న పాల్గొన్న సందర్భాలు చాలా ఉన్నాయని సల్మాన్ పేర్కొన్నాడు. కాలుకు గాయమైన కూడా లెక్క చేయకుండా షూటింగ్‌లు, ప్రమోషన్స్ పూర్తిచేసిందని పొగడ్తలు కురిపించాడు.
సికిందర్ మూవీ ఈద్ కానుకగా మార్చి 30న రిలీజ్ అవుతోంది. ఆదివారం రిలీజైన ట్రైలర్ యాక్షన్ , కామెడీ అంశాలతో సాగింది. వాంటెడ్ అంటూ సల్మాన్ ఖాన్ పోస్టర్‌ను పోలీసులు స్టేషన్‌లో అంటించే సీన్‌తోనే ఈ ట్రైలర్ ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్‌పై తెరకెక్కించిన యాక్షన్ సీన్స్ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలుస్తోన్నాయి. తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు.
ఈ ట్రైలర్‌లో సల్మాన్‌ను ప్రేమించే అమ్మాయిగా రష్మిక కనిపించింది. వారిద్దరి కెమిస్ట్రీని డిఫరెంట్‌గా ఈ ట్రైలర్‌లో చూపించాడు మురుగదాస్. సికందర్ మూవీలో బాహుబలి ఫేమ్, కోలీవుడ్ యాక్టర్ సత్యరాజ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. యానిమల్, ఛావా బ్లాక్‌బస్టర్స్ తర్వాత రష్మిక నటిస్తోన్న బాలీవుడ్ మూవీ ఇదే కావడం గమనార్హం.
సంబంధిత కథనం