ఒక హీరో స్టార్‌డమ్ ఎంత ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం చాలా కష్టం. ఎంత పెద్ద హీరో అయిన కథ, కథనాలు సరిగా లేకుంటే ఆడియెన్స్‌తోపాటు అభిమానులు కూడా థియేటర్లలో సరిగా సినిమాలను చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే, థియేటర్లలో కాకుండే ఓటీటీల్లో ఎంచక్కా వీక్షించే అవకాశం ఉంది కాబట్టి.
ఇదిలా ఉంటే, సినిమా ఎలా ఉన్నా రూ. 100 కోట్లు రాబట్టగలిగే హీరోలు ఇండియాలో చాలా మందే ఉన్నారు. అయితే, ఏకంగా 18 సార్లు వరుసగా వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరో మాత్రం ఒకే ఒక్కరు ఉన్నారు. అది కూడా సోలో హీరోగా నటించి, ఆ 18 సినిమాలో ప్లాఫ్స్ కూడా ఉన్నప్పటికీ వాటిని వంద కోట్ల క్లబ్ వైపుకు నడిపించి ఏకైక ఇండియన్ హీరోగా చరిత్రలో ఒక్కడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఈ మాటలు వింటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ సినిమాలు వరుసగా రూ. 100 కోట్ల కలెక్ట్ చేస్తున్నాయి. కానీ, 18 సార్లు వంద కోట్ల క్లబ్‌లో చేరిన హీరో ప్రభాస్ మాత్రం కాదు. అది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. అభిమానులు ముద్దుగా సల్లూ భాయ్ అని పిలుచుకుంటారు.
అవును, సల్మాన్ ఖాన్ నటించిన 18 సినిమాలు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి అతడి రేంజ్, స్టార్‌డమ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో నిరూపించాయి. అందులో డిజాస్టర్ సినిమాలు కూడా వంద కోట్లు రాబట్టి ఆశ్చర్యపరిచాయి. సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ తొలిసారిగా రూ. 100 కోట్లు రాబట్టింది.
ఆ తర్వాత రెడీ, బాడీగార్డ్, ఏక్ థా టైగర్, దబాంగ్ 2, జయహో, కిక్, భజరంగీ భాయిజాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రేస్ 3, భారత్, దబాంగ్ 3, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, టైగర్ 3, సికందర్ సినిమాలు వరుసగా వంద కోట్లు రాబట్టాయి.
రష్మిక మందన్నాతో సల్మాన్ ఖాన్ నటించిన చివరి చిత్రం సికందర్. ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సికందర్ సినిమా సైతం బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మొత్తంగా రూ. 177 కోట్ల కలెక్షన్స్ వరకు వచ్చాయి.
ఇలా ఏకంగా 18 సార్లు వరుసగా రూ. 100 కోట్ల మార్క్‌ను అందుకున్న ఏకైక హీరోగా సల్మాన్ ఖాన్ నిలిచాడు. దీంతో ఇండియన్ హీరోల్లో ఆల్ టైమ్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ 100 క్రోర్స్ మూవీస్ హీరోగా సంచలన హీరోగా సల్లూ భాయ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలలో మల్టీస్టారర్ కాకుండా సోలో హీరో మూవీసే ఎక్కువగా ఉండటం విశేషం.
సంబంధిత కథనం