Salman Khan Biggest Flop Movie Ever: బాలీవుడ్ స్టార్ హీరోల్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకరు. సల్మాన్ ఖాన్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే, అతని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తాయి. అయితే, అలాంటి సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినీ కెరీర్‌లో ఓ సినిమా మాత్రం బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచింది.
2007లో విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా మ్యారిగోల్డ్. విల్లార్డ్ కారోల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సల్మాన్‌కు హాలీవుడ్ యాక్షన్ హీరోయిన్ అలి లార్టర్ జోడీగా నటించింది. ఆమెతోపాటు మరో అమెరికన్ నటి హెలెన్ కీలక పాత్ర పోషించింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కిన మ్యారిగోల్డ్ సినిమా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆగస్ట్ 17న విడుదలైంది.
మ్యారిగోల్డ్ ఒక రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ జోనర్ మూవీ. మ్యారిగోల్డ్ డైరెక్టర్ విల్లార్డ్ కారోల్ దర్శకత్వం వహించిన తొలి, చిట్ట చివరి బాలీవుడ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమా అమెరికన్ నటి అలి లార్టర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక సినిమా ప్రాజెక్టు కోసం ముంబైకి వస్తుంది. కానీ, ఆ ప్రాజెక్టు రద్దు అవుతుంది. అయితే, ఆమె ఒక బాలీవుడ్ సంగీత చిత్రంలో చిన్న పాత్ర పోషిస్తుంది.
సల్మాన్ ఖాన్ పోషించిన కోరియోగ్రాఫర్ ప్రేమ్ అనే పాత్రతో ప్రేమలో పడుతుంది. ఇక మరో అమెరికన్ నటి హెలెన్ ప్రేమ్‌కి అమ్మమ్మగా నటించింది. కాగా, మ్యారిగోల్డ్ సినిమా రూ. 19 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. అంటే, 2007లో ఒక సినిమాకు ఇంతల ఖర్చు చేయడం పెద్ద విషయమే. అంతటి మ్యారిగోల్డ్ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది.
మ్యారిగోల్డ్ సినిమాకు మొదటి రోజు కేవలం రూ. 21 లక్షలు మాత్రమే వచ్చాయి. అలా, రెండు వారాల్లో రూ. 38 లక్షల కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి. ఆ తర్వాత దేశీయ బాక్స్ ఆఫీస్ వద్ద రూ. 1.27 కోట్లతో సరిపెట్టుకుంది మ్యారిగోల్డ్ సినిమా. అలాగే, పలు నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సల్మాన్ ఖాన్ మ్యారిగోల్డ్ సినిమా రూ. 2.29 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టగలిగింది.
దీంతో సల్మాన్ ఖాన్ సినీ కెరీర్‌లోనే మ్యారిగోల్డ్ అతిపెద్ద ప్లాప్ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా, డైరెక్టర్ విల్లార్డ్ కారోల్ మ్యారిగోల్డ్ మూవీకి ముందు ది రన్‌స్టోన్, ప్లేయింగ్ బై హార్ట్, టామ్స్ మిడ్‌నెట్ గార్డెన్ వంటి చిత్రాలను తెరకెక్కించాడు. మ్యారిగోల్డ్ ప్లాప్ దెబ్బకు ఆ తర్వాత విల్లార్డ్ కారోల్ మరో సినిమాను డైరెక్ట్ చేయలేదు. 2007 తర్వాత చిత్ర నిర్మాణం, రైటింగ్ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
దాంతో విల్లార్డ్ కారోల్ మొదటి బాలీవుడ్ అండ్ చివరి సినిమాగా మ్యారిగోల్డ్ నిలిచింది.అలాగే, మ్యారిగోల్డ్‌లో హీరోయిన్‌గా నటించిన అలి లార్టర్ కూడా మరే హిందీ సినిమాలో కనిపించలేదు. అంతలా మ్యారిగోల్డ్ మూవీ వీరిద్దరిపై ఎఫెక్ట్ చూపింది.
కాగా అలి లార్టర్ లీగల్లీ బ్లోండ్, ఫైనల్ డెస్టినేషన్, హీరోస్ టీవీ షో వంటి హిట్ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించడంతో పాపులర్ అయింది. రెసిడెంట్ ఈవిల్: ఎక్స్‌టింక్షన్, రెసిడెంట్ ఈవిల్: ఆఫ్టర్‌లైఫ్, రెసిడెంట్ ఈవిల్: ది ఫైనల్ చాప్టర్ చిత్రాల్లో కూడా అలి లార్టర్ మంచి పేరు తెచ్చుకుంది. ఈ రెసిడెంట్ ఈవిల్ సిరీస్‌కు ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉండటం విశేషం.
సంబంధిత కథనం