Tiger 3: థియేటర్‌లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్: అదిరిపడ్డ ప్రేక్షకులు: స్పందించిన ఆర్‌జీవీ.. వీడియో వైరల్-salmaan khan fans burst firecrackers in theatre while watching tiger 3 movie video goes viral and ram gopal varma reacts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Salmaan Khan Fans Burst Firecrackers In Theatre While Watching Tiger 3 Movie Video Goes Viral And Ram Gopal Varma Reacts

Tiger 3: థియేటర్‌లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్: అదిరిపడ్డ ప్రేక్షకులు: స్పందించిన ఆర్‌జీవీ.. వీడియో వైరల్

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 13, 2023 02:18 PM IST

Tiger 3: టైగర్ 3 సినిమాను చూస్తూ థియేటర్లోనే భారీగా టపాసులు పేల్చారు అభిమానులు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా భయపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍ అవుతోంది. దీనిపై డైెరెక్టర్ ఆర్జీవీ కూడా స్పందించారు.

Tiger 3: థియేటర్‌లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్: అదిరిపడ్డ ప్రేక్షకులు: స్పందించిన ఆర్‌జీవీ
Tiger 3: థియేటర్‌లోనే టపాసులు పేల్చిన ఫ్యాన్స్: అదిరిపడ్డ ప్రేక్షకులు: స్పందించిన ఆర్‌జీవీ

Tiger 3: బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘టైగర్ 3’ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. ఆదివారం (నవంబర్ 12) ఈ చిత్రం రిలీజ్ అయింది. దీంతో సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‍తో ఉన్నారు. థియేటర్ల వద్ద హంగామా చేస్తున్నారు. అయితే, ఓ థియేటర్‌లో అభిమానుల ఉత్సాహం హద్దులు దాటింది. ఏకంగా థియేటర్‌లోనే టపాసులు కాల్చారు.

ట్రెండింగ్ వార్తలు

టైగర్ 3 సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో కొందరు సల్మాన్ ఖాన్ అభిమానులు హఠాత్తుగా టపాసులు పేల్చారు. అది కూడా అధిక సంఖ్యలో కాల్చారు. దీంతో థియేటర్ మొత్తం బాణసంచా మోత మోగింది. ఇతర ప్రేక్షకులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. సీట్లలో నుంచి లేచారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‍ఫామ్‍ ఎక్స్ (ఒకప్పుడు ట్విట్టర్)లో వైరల్‍గా మారింది.

థియేటర్లో బాణసంచా పేల్చడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించారు. “మనల్ని మనం పిచ్చోళ్లం కాదని భావిస్తున్నాం” ఆర్జీవీ ట్వీట్ చేశారు. అంటే థియేటర్లో టపాసులు కాల్చిన వాళ్లని పరోక్షంగా పిచ్చోళ్లని ఆయన అన్నారు.

థియేటర్లో టపాసులు పేల్చడంపై కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అభిమానం పేరుతో ఇతర ప్రేక్షకులను హడలెత్తించడం సరికాదని కొందరు కామెంట్లు చేస్తున్నారు. బాణసంచా వల్ల థియేటర్లో అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితేంటని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదెక్కడి పైత్యమంటూ కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా థియేటర్‌లో టపాసులు పేల్చిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

మరోవైపు, టైగర్ 3 సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. సల్మాన్ ఖాన్ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోయేలా ఉన్నా.. అంచనాలు పెట్టుకున్న స్థాయిలో కథ, కథనాలు లేవని టాక్ వచ్చింది. అయితే, తొలిరోజు మాత్రం కలెక్షన్లలో టైగర్ 3 సత్తాచాటింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే సుమారు రూ.90కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను ఈ చిత్రం రాబట్టిందని తెలుస్తోంది.

యశ్‍రాజ్ ఫిల్స్మ్ స్పై యూనివర్స్‌లో భాగంగా టైగర్ 3 రూపొందింది. టైగర్ 3 చిత్రంలో కత్రీనా కైఫ్ హీరోయిన్‍గా నటించారు. ఇమ్రాన్ హష్మీ కీలకపాత్ర పోషించారు. రేవతి, సిమ్రన్, రిధి డోగ్రా, విశాల్ జెథ్వా, రణ్‍వీర్ షోర్లే కీరోల్స్ చేశారు.

టైగర్ 3 చిత్రానికి మనీశ్ శర్మ దర్శకత్వం వహించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీతమ్, తన్‍జూ టికు సంగీతం అందించారు. సుమారు రూ.300కోట్ల బడ్జెట్‍తో ఈ సినిమా రూపొందినట్టు అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.