58 ఏళ్ల వయసులో బికినీలో హాలీవుడ్ న‌టి బోల్డ్‌ షో.. స‌ల్మా హాయ‌క్‌ హాట్ స్విమ్‌సూట్‌ వీడియో చూస్తే అరాచ‌క‌మే భయ్యా-salma hayek bold photoshoot in swimsuit for sports illustrated cover page bts hot video goes viral in social media ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  58 ఏళ్ల వయసులో బికినీలో హాలీవుడ్ న‌టి బోల్డ్‌ షో.. స‌ల్మా హాయ‌క్‌ హాట్ స్విమ్‌సూట్‌ వీడియో చూస్తే అరాచ‌క‌మే భయ్యా

58 ఏళ్ల వయసులో బికినీలో హాలీవుడ్ న‌టి బోల్డ్‌ షో.. స‌ల్మా హాయ‌క్‌ హాట్ స్విమ్‌సూట్‌ వీడియో చూస్తే అరాచ‌క‌మే భయ్యా

58 ఏళ్ల వయసులో హాలీవుడ్ నటి సల్మా హాయక్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ కవర్ పేజీ కోసం స్విమ్ సూట్ లో ఆమె హాట్ ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇక బీటీఎస్ వీడియో అయితే మరింత అందాల అరాచకమే.

బికినీలో సల్మా హాయక్

ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే అని.. తన అందాలు తగ్గవని హాలీవుడ్ హాట్ యాక్ట్రెస్ సల్మా హాయక్ నిరూపిస్తోంది. 58 ఏళ్ల వయసులో స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ పేజీపై ఆమె దర్శనమిచ్చింది. అది కూడా అలా ఇలా కాదు. ఏకంగా బికినీలో అందాలు ఆరబోసింది. బోల్డ్ ఫొటోస్ తో పిచ్చెక్కించింది. ఈ వయసులో సల్మా ఇలా ఉన్నారంటే.. మరి అప్పట్లో అని ఫ్యాన్స్ అనుకునేలా రచ్చ చేసింది.

ఆ వీడియో అరాచకమే

స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ పేజీ కోసం జరిగిన షూట్ కు సంబంధించి బీటీఎస్ మూమెంట్స్ ను సల్మా హాయక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె ఎక్స్ పోజింగ్ వేరే లెవల్ లో ఉంది. ఎద భాగంలో ఎలాంటి దుస్తులు లేకుండా ఉన్న సల్మాతో వీడియో స్టార్ట్ అయింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది.

'నా స్విమ్ సూట్ కవర్ షూట్ కోసం #బీటీఎస్' అని పోస్టుకు క్యాప్షన్ ఇచ్చింది సల్మా. బీచ్ లో, పూల్ లో బికినీ అందాలతో సల్మా ఊపేస్తోంది. ఈ వీడియో ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఉంది.

ఆమె ఓ స్ఫూర్తి

స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మంగళవారం (మే 13) సాయంత్రం ఇన్ స్టాగ్రామ్ లో సల్మా కవర్ ఫోటోను షేర్ చేస్తూ 'సల్మా ప్రకృతి శక్తి. నటిగా, నిర్మాతగా, పరోపకారిగా, మహిళల కోసం ఛాంపియన్ గా సల్మా లాటినెక్స్ కమ్యూనిటీలకు దిక్సూచిగా నిలిచింది. అవిశ్రాంత న్యాయవాదిగా, కళ, జీవితం, మానవత్వం పట్ల అభిరుచి ఉన్న వ్యక్తి ఆమె. మీ స్వంత నిబంధనల ప్రకారం జీవించడమే అంతిమ శక్తి అని మనందరికీ చూపించడం ద్వారా రాబోయే తరాలకు ఆమె స్ఫూర్తినిస్తోంది’’ అని పోస్టు చేసింది.

ఆ ఛాన్స్ నమ్మలేదు

తన కవర్ షూట్ గురించి మాట్లాడుతూ, తనకు ఆ ఛాన్స్ వస్తుందని నమ్మలేదని సల్మా పేర్కొంది. "నేను ఆ కవర్ మీద ఉండగలనని నా మనస్సులో ఎప్పుడూ లేదు. నా శరీరం తప్పనిసరిగా మోడల్ రకం కాదు. అది సాధ్యమని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు నాకు 58 ఏళ్లు. ఈ వయసులో ఇది జరగడం షాకింగ్ గా ఉంది’’ అని సల్మా తెలిపింది.

కెరీర్ ఇలా

మెక్సికన్ అమెరికన్ నటి అయిన సల్మా 80వ దశకంలో మెక్సికన్ టెలినోవెలాస్ లో తన కెరీర్ ను ప్రారంభించింది. 90వ దశకంలో డెస్పెరాడో, ఫ్రమ్ డస్క్ టు డాన్, వైల్డ్ వైల్డ్ వెస్ట్ వంటి చిత్రాలతో హాలీవుడ్ లో స్థిరపడింది. ఆమె ఫ్రిడా (2002) చిత్రంలోని నటనకు విమర్శకుల ప్రశంసలు, ఆస్కార్ నామినేషన్ పొందింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం ఎటర్నల్స్ (2021)లో అజాక్ పాత్రతో పాటు గ్రోన్ అప్స్, ది హిట్మ్యాన్స్ బాడీగార్డ్ వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

ఫ్యాన్స్ ఎమన్నారంటే?

ఎస్ ఐ స్విమ్ సూట్ ఎడిషన్ కవర్ పేజీపై కనిపించడానికి సల్మాకు ఇంత సమయం పట్టడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. 'సల్మా ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఇది త్వరగా జరగకపోవడం ఆశ్చర్యంగా ఉంది' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. 60 ఏళ్లకు దగ్గరగా ఉన్నప్పటికీ సల్మా ఫిట్ నెస్ చూసి మరికొందరు ఆశ్చర్యపోయారు.

'మనలో 20-30 ఏళ్ల వయసున్న వారిలో 90 శాతం మంది కంటే 58 ఏళ్ల సల్మా మెరుగ్గా కనిపిస్తోంది' అని ఓ ఇన్ స్టాగ్రామ్ యూజర్ రాసుకొచ్చాడు. ‘ఆమె ఎప్పుడూ దేవతే. ఆమె వయస్సును మర్చిపోయినట్లుగా ఉంది’ అని మరికొందరు పేర్కొన్నారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం