Salaar Rights: వామ్మో...స‌లార్ నైజాం రైట్స్‌కు అన్ని కోట్లా...రేసులోకి దిల్‌రాజు-salaar update huge demand on prabhas salaar movie theatrical rights in nizam area ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Salaar Update Huge Demand On Prabhas Salaar Movie Theatrical Rights In Nizam Area

Salaar Rights: వామ్మో...స‌లార్ నైజాం రైట్స్‌కు అన్ని కోట్లా...రేసులోకి దిల్‌రాజు

HT Telugu Desk HT Telugu
Aug 29, 2023 09:53 AM IST

Salaar Rights: స‌లార్ థియేట్రిక‌ల్ రైట్స్ కోసం భారీగా డిమాండ్ ఏర్ప‌డింది. నైజాం ఏరియా రైట్స్ కోస‌మే 80 కోట్లకుపైగా చెల్లించ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్స్ పోటీప‌డుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌భాస్ స‌లార్
ప్ర‌భాస్ స‌లార్

Salaar Rights: ప్ర‌భాస్(Prabhas) స‌లార్ మూవీకి సెప్టెంబ‌ర్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ మూవీ రిలీజ్‌కు నెల రోజులు టైమ్ ఉండ‌గానే థియేట్రిక‌ల్‌తో పాటు డిజిట‌ల్‌, శాటిలైట్ బిజినెస్ దాదాపు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్‌కోసం ఫుల్ డిమాండ్ ఏర్ప‌డింది. తెలుగు రైట్స్ దాదాపు 200 కోట్ల‌కుపైనే అమ్ముడుపోయే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సినిమా నైజాం ఏరియా థియేట్రిక‌ల్ రైట్స్ ద‌క్కించుకునేందుకు నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్‌ దిల్‌రాజు(Dil Raju) పోటీప‌డుతోన్న‌ట్లు తెలిసింది. నైజాం రైట్స్ కోసం 80 కోట్ల వ‌ర‌కు చెల్లించ‌డానికి దిల్‌రాజు రెడీ అయిన‌ట్లు చెబుతోన్నారు. దిల్ రాజుతో పాటు మ‌రో రెండు టాప్ ప్రొడ‌క్ష‌న్ హౌజెస్ పోటీలోకి రావ‌డంతో ఈ రేటు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

వంద కోట్లు దాటే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు. మంగ‌ళ‌వారం రోజు నైజాం ఏరియా థియేట్రిక‌ల్ రైట్స్‌పై క్లారిటీ రానున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు డిజిట‌ల్ రైట్స్ కోసం 100 కోట్ల‌కుపైనే చెల్లించ‌డానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రెడీగా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ముంబయిలో ట్రైల‌ర్‌...

స‌లార్ ట్రైల‌ర్ రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది ప్ర‌భాస్ అభిమానుల‌తో సినిమా ల‌వ‌ర్స్‌లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబ‌ర్ 7న ముంబ‌యిలో ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీగా నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌పై కూడా మ‌రో ఒక‌టి, రెండు రోజుల్లో క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

ఈ ఈవెంట్‌కు ప్ర‌భాస్‌, ప్ర‌శాంత్ నీల్‌తో పాటు ప‌లువురు బాలీవుడ్‌, ద‌క్షిణాది సినీ ప్ర‌ముఖులు హాజ‌రుకాబోతున్న‌ట్లు చెబుతోన్నారు. స‌లార్ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ విల‌న్‌గా న‌టిస్తోన్నాడు. జ‌గ‌ప‌తిబాబు, శృతిహాస‌న్‌, టీనూ ఆనంద్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిల్మ్స్ ప‌తాకంపై స‌లార్ మూవీని విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.