Salaar Trailer Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ ట్రైలర్ వచ్చేది ఆ రోజే-salaar trailer release date revealed to release on december 1st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salaar Trailer Release Date Revealed To Release On December 1st

Salaar Trailer Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ ట్రైలర్ వచ్చేది ఆ రోజే

Hari Prasad S HT Telugu
Nov 12, 2023 10:57 AM IST

Salaar Trailer Release Date: ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు దీపావళి నాడు అదిరిపోయే గుడ్‌న్యూస్. అతని లేటెస్ట్ మూవీ సలార్ ట్రైలర్ డిసెంబర్ 1నే రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రానుంది
సలార్ ట్రైలర్ డిసెంబర్ 1న రానుంది

Salaar Trailer Release Date: ప్రభాస్ సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. డిసెంబర్ 1న ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఆదివారం (నవంబర్ 12) వెల్లడించారు. దీపావళి రోజు రెబల్ స్టార్ అభిమానులకు ఇది నిజంగా పండగలాంటి వార్తే.

ట్రెండింగ్ వార్తలు

సలార్ పార్ట్ 1: సీజ్‌ఫైర్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజై చాలా రోజులవుతోంది. ట్రైలర్ కోసం ఎన్నాళ్లుగానో అభిమానులు ఎదురు చూస్తున్నారు. మొత్తానికి డిసెంబర్ 1, సాయంత్రం 7.19 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడం విశేషం.

ఈ విషయాన్ని అనౌన్స్ చేయడానికి ప్రభాస్ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ ఓ జీపుపైకి ఎక్కి చేతిలో గన్ను పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపించాడు. టీజర్ లో ప్రభాస్ ను పెద్దగా చూపించకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు.. ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండనుందన్న ఆశతో ఉన్నారు.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే సలార్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షారుక్ ఖాన్ నటిస్తున్న డంకీ మూవీ రిలీజ్ అవుతున్న రోజే రిలీజ్ కానుండటంతో బాక్సాఫీస్ కలెక్షన్లు ఎలా ఉండోబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. డంకీ ప్రభావం సలార్ పై ఉంటుందా? లేదా.. ఈ ఇద్దరు సూపర్ స్టార్లలో ఎవరిది పైచేయి అవుతుందన్నది చూడాలి.

సలార్ మూవీ షూటింగ్ చాలా రోజుల కిందటే మొదలైంది. అయితే భారీ బడ్జెట్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సినిమాను తెరకెక్కిస్తుండటంతో నిర్మాణం ఆలస్యమవుతూ వస్తోంది. సెప్టెంబర్ 27నే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో డిసెంబర్ 22కు వాయిదా వేశారు. ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు కూడా నటించారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.