Salaar Trailer: సలార్ ట్రైలర్ కూడా అలాగే ఉండనుందట!-salaar trailer may not reveal the part one story details check details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Salaar Trailer May Not Reveal The Part One Story Details Check Details

Salaar Trailer: సలార్ ట్రైలర్ కూడా అలాగే ఉండనుందట!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 17, 2023 02:02 PM IST

Salaar Trailer: ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ మూవీ ట్రైలర్ విషయంలో అంచనాలు వెలువడుతున్నాయి. ట్రైలర్ ఎలా ఉంటుందన్న దానిపై సమాచారం వచ్చింది.

Salaar Trailer: సలార్ ట్రైలర్ కూడా అలాగే ఉండనుందట!
Salaar Trailer: సలార్ ట్రైలర్ కూడా అలాగే ఉండనుందట!

Salaar Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ మూవీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ మూవీ సెప్టెంబర్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ మూవీ అప్‍డేట్లు ఇవ్వాలంటూ అభిమానులు చిత్ర యూనిట్‍ను డిమాండ్ చేస్తున్నారు. అయితే, సలార్ ట్రైలర్‌ కట్ పనులపై మూవీ యూనిట్‍ ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే.

‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ ట్రైలర్‌ను మరో రెండు వారాల్లో రిలీజ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ నిర్ణయించింది. ట్రైలర్ ఎలా ఉండాలన్న దానిపై కూడా ఇప్పటికే డిసైడ్ అయిందని సమాచారం. టీజర్ లాగానే.. ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ ట్రైలర్‌లో కూడా యాక్షన్స్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ట్రైలర్‌లో యాక్షన్‍ను అధికంగా చూపించేందుకే చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. సలార్ స్టోరీ గురించి ట్రైలర్‌లో ఎక్కువగా రివీల్ చేయకూడదని డిసైడ్ చేసుకుందని సమాచారం.

‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ టీజర్ జూలై మొదట్లో వచ్చింది. ఈ టీజర్ మొత్తం ఎలివేషన్ డైలాగ్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ‘జురాసిక్ పార్క్’ డైలాగ్ ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ట్రైలర్ సైతం ఇలానే కాస్త ఎక్కువ నిడివితో యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్లతోనే ఉండనుందట.

ఇప్పటికే సలార్ మూవీకి ఫుల్ క్రేజ్ ఉన్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా అంత భారీ స్థాయిలో చేయాల్సిన అవసరం లేదనే భావనలోనూ చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, పాటలను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తుందా.. లేదా సందేహాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 15న ఫస్ట్ సింగిల్ గురించి అప్‍డేట్ పక్కా అని బజ్ వచ్చినా.. అలా జరగలేదు.

సలార్ చిత్రంలో హీరో ప్రభాస్‍కు జోడీగా శృతిహాసన్ నటించారు. విలన్‍ పాత్రను మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ పోషించగా.. జగపతి బాబు, టిన్నూ ఆనంద్, ఈశ్వరి రావు, శ్రీయా రెడ్డి కీ రోల్స్‌లో కనిపించనున్నారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సినిమా సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇంగ్లిష్ వెర్షన్‍ను కూడా చిత్ర యూనిట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

IPL_Entry_Point