Salaar Story Leak : సలార్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం.. 1000 మందితో తండ్రీకొడుకుల ఫైట్!-salaar story leak prabhas in double role and fight with 1000 members ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Story Leak : సలార్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం.. 1000 మందితో తండ్రీకొడుకుల ఫైట్!

Salaar Story Leak : సలార్ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం.. 1000 మందితో తండ్రీకొడుకుల ఫైట్!

Anand Sai HT Telugu
Aug 21, 2023 11:07 AM IST

Salaar Story Leak : ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి.. సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమా స్టోరీకి సంబంధించిన విషయంపై చర్చ నడుస్తోంది.

సలార్ సినిమాలో ప్రభాస్
సలార్ సినిమాలో ప్రభాస్

ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరో వస్తున్న చిత్రం సలార్. విడుదల తేదీ దగ్గర పడుతోంది. ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా కథ లీక్ కావడంతో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నాడనే ప్రచారం మొదలైంది.

కేజీఎఫ్‌(KGF) సిరీస్‌కి పనిచేసిన టీమ్‌లో చాలా మంది సలార్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాన్ని హోంబళే నిర్మిస్తున్నారు. సుమారు 400 కోట్లు బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మొదటి పార్ట్ చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

సినిమాకు సంబంధించిన విషయాలు లీక్ కాకుండా సలార్ టీం(Salaar Team) కేర్ తీసుకుంటుంది. కంటెంట్ లీకేజీ అవుతుందనే భయంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను బస్రూర్‌కు మార్చినట్లు సమాచారం. రవి బస్రూర్ స్టూడియోలో రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాణ సమయంలో సోషల్ మీడియాలో స్టోరీ లీక్‌లు రావడం మామూలే. సలార్‌(Salaar Story Leak) విషయంలో ఇలాంటి చర్చే పదే పదే జరుగుతూనే ఉంది.

ఓ అభిమానిగా సలార్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లాడట. అక్కడ చిత్రీకరించిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని తెలిపాడు. ఒకానొక దృశ్యంలో ఒక్క ప్రభాస్ చుట్టూ వెయ్యి మంది జనం ఉంటారని, అతడిని రక్షించేందుకు మరో ప్రభాస్ అడుగుపెడతాడని వెల్లడించారు. అంటే ఈ సినిమాలో ప్రభాస్‌కు ద్విపాత్రాభినయం చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఓ కన్నడ నటుడు కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. 1000 మంది మధ్య జరిగే పోరాటం ఎలా ఉంటుందోనని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ కమ్ బ్యాక్ సినిమా కోసం ఎదురుచూస్తు్న్నాడు. ప్రస్తుతానికి సలార్, కల్కి ఏడీ2898 సినిమాపై హోప్స్ పెట్టుకున్నాడు. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమాల కోసం ఎంతగానో ఎదురచూస్తున్నారు. విడుదలకు దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 28న సలార్ చిత్రం విడుదల అవనుంది. ఇప్పటికే సలార్ సినిమా రికార్డులు సృష్టించింది. టీజర్ జూలై 6న విడుదలై చాలా రోజులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండింగ్ లోనే ఉంది. ఇటు ప్రభాస్, అటు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సహజంగానే వీరిద్దరి కాంబినేషన్ అనడంతో బాగా హైప్ క్రియేట్ అయింది. ఇక వెయ్యి మందితో ఫైట్ అంటే.. ఫ్యాన్స్ కు పూనకాలే వస్తాయి.