పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ మూవీకి ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంది. 2023 డిసెంబర్ నెలలో విడుదలైన ఈ హైవోల్టేజ్ యాక్షన్ చిత్రం బ్లాక్‍బస్టర్ సాధించింది. రూ.700కోట్లకు పైగా వసూళ్లతో అదరగొట్టింది. ఆ తర్వాత ఓటీటీలోనూ డామినేట్ చేసింది. సలార్ ఫీవర్ అలాగే కొనసాగుతోంది. ఈ చిత్రం చాలాసార్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అంత క్రేజ్ ఉన్న సలార్ చిత్రం ఈ శుక్రవారం (మార్చి 21) థియేటర్లలో రీ-రిలీడైంది. ఇప్పుడు కూడా అదిరే కలెక్షన్లు సొంతం చేసుకుంది.
సలార్ చిత్రానికి రీ-రిలీజ్‍లో తొలి రోజు రూ.3.24 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఎలాంటి స్పెషల్ సందర్భం లేకుండా రీ-రిలీజై ఈ స్థాయిలో కలెక్షన్లు దక్కించుకుంది. సలార్ మూవీ పరిమిత థియేటర్లలోనే రీ-రిలీజైనా ఆక్యుపెన్సీ భారీగా కనిపించింది. దీంతో తొలి రోజు రూ.3.24 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.
సలార్ రీ-రిలీజ్ సందర్భంగా చాలా చోట్ల థియేటర్లలో ప్రభాస్ అభిమానులు హంగామా చేశారు. సినిమాలోనూ సీన్లను అనుకరిస్తూ థియేటర్లలో యాక్షన్ కూడా చేసేశారు. కేకలతో మోతెక్కించేశారు. సలార్ క్రేజ్ ఏంటో చూపించారు. ఈ చిత్రానికి శనివారం కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. దీంతో కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశం ఉంది. మరి రీ-రిలీజ్‍లో ఈ చిత్రం మొత్తంగా ఎంత కలెక్షన్లు దక్కించుకుంటుందో చూడాలి.
సలార్ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. అభిమానులు కోరుకునే విధంగా ప్రభాస్‍ను ఫుల్ యాక్షన్ మోడ్‍లో చూపించి మెప్పించారు. యాక్షన్ సీక్వెన్సుల్లో రెబల్ స్టార్ విశ్వరూపం చూపించేశారు. కాటేరమ్మ ఎపిసోడ్ ఐకానిక్‍గా నిలిచిపోయింది. ఖాన్సార్ సింహాసనం కోసం కొన్ని వర్గాల మధ్య జరిగే పోరును ఆసక్తికరంగా, హైవోల్టేజ్ యాక్షన్‍తో తెరకెక్కించారు ప్రశాంత్. సలార్ మూవీ సినీ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది.
సలార్ చిత్రంలో ప్రభాస్‍తో పాటు పృథ్విరాజ్ సుకుమారన్ లీడ్ రోల్ చేశారు. ప్రాణ స్నేహితులుగా నటించారు. ఈ చిత్రంలో శృతి హాసన్, శ్రీయారెడ్డి, జగపతి బాబు, ఈశ్వరి రావు, టినూ ఆనంద్, బాబీ సింహా కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రవి బస్రూర్ అందించిన సంగీతం కూడా పెద్ద ప్లస్‍గా నిలిచింది. హొంబాలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ మూవీని ప్రొడ్యూజ్ చేశారు.
సలార్ మూవీకి సీక్వెల్ సలార్: శౌర్యంగపర్వం పేరుతో రానుంది. ఈ చిత్రం కోసం చాలా క్యూరియాసిటీ నెలకొంది. ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్, హను రాఘవపూడితో మూవీ చేస్తున్నారు. స్పిరిట్ సినిమాతో పాటు ప్రశాంత్ వర్మతోనూ ఓ చిత్రం చేయనున్నారు. ఆ తర్వాతే సలార్ 2 పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం