Salaar new release date: సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా.. ఆ రెండు తేదీల్లో ఏది?
Salaar new release date: సలార్ కొత్త రిలీజ్ డేట్ ఇదే అంటూ మరోసారి వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. మేకర్స్ ఇప్పటికే రెండు తేదీలు అనుకున్నారని, అందులో ఏదో ఒక రోజు ఈ మూవీ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.
Salaar new release date: సలార్ రిలీజ్ ఎప్పుడు? ప్రభాస్, ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఎన్నో నెలలుగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 28న రిలీజ్ కానుందంటే తెగ సంబరపడిపోయారు. ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఇక మూవీ రిలీజే తరువాయి అనుకున్నారు. కానీ అనూహ్యంగా సెప్టెంబర్ 28న రిలీజ్ కుదరదని మేకర్స్ తేల్చి చెప్పేశారు.
ట్రెండింగ్ వార్తలు
పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో వాయిదా తప్పడం లేదని అన్నారు. మరి సలార్ ఎప్పుడు రిలీజ్ కానుందనే అంశంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా కోసం రెండు తేదీలను మేకర్స్ అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి కూడా నవంబర్ నెలలో. అన్నీ అనుకున్నట్లు జరిగితే నవంబర్ 10 లేదా నవంబర్ 24న సలార్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ప్రభాస్ లీడ్ రోల్లో, శృతి హాసన్ ఫిమేల్ లీడ్ గా నటించిన ఈ మూవీ ఎంతో ఆసక్తి రేపుతోంది. హ్యాట్రిక్ పరాజయాలతో ఢీలా పడిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఈ సలార్ తో అయినా తమ అభిమాన హీరో గాడిలో పడతాడని ఆశిస్తున్నారు. కేజీఎఫ్ లాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన ప్రశాంత్ నీల్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటం వాళ్లను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ ఓ టెంపుల్‌ను సందర్శించారు. కుటుంబసభ్యుల పేరు మీద గుడిలో అర్చన చేయించాడు. పూజారి అర్చన చేస్తోన్న సమయంలో తన ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో పాటు సలార్ మూవీ పేరును కూడా అతడికి చెప్పాడు ప్రశాంత్ నీల్.
సలార్ సినిమాను తన ఫ్యామిలీలో మెంబర్‌లాగే భావించి ప్రశాంత్ నీల్ అర్చన చేయించడంపై ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు. ప్రశాంత్ నీల్ అర్చన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. శృతిహాసన్, టీనూ ఆనంద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ దాదాపు రెండు వందల కోట్ల వ్యయంతో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడంతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ సలార్ మూవీ రిలీజ్ కానుంది.