Salaar in IMAX: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ఐమ్యాక్స్‌లో సలార్ తుఫాన్-salaar in imax format confirms makers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar In Imax: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ఐమ్యాక్స్‌లో సలార్ తుఫాన్

Salaar in IMAX: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ఐమ్యాక్స్‌లో సలార్ తుఫాన్

Hari Prasad S HT Telugu
Aug 18, 2023 07:27 AM IST

Salaar in IMAX: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే. ఐమ్యాక్స్‌లో సలార్ తుఫాన్ రానుంది. సినిమాను ఈ ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనన్నట్లు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫమ్ చేశారు.

ఐమ్యాక్స్ ఫార్మాట్లో రానున్న సలార్
ఐమ్యాక్స్ ఫార్మాట్లో రానున్న సలార్

Salaar in IMAX: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సలార్ మూవీ ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ అభిమానులను అలరించనుంది. ఈ సినిమాను ఈ ఫార్మాట్లోనూ రిలీజ్ చేయనున్నట్లు యూఎస్ డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ధృవీకరించారు. ఈ ఐమ్యాక్స్ వెర్షన్ కోసం టికెట్ల బుకింగ్స్ త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

అయితే ఈ ఐమ్యాక్స్ వెర్షన్ ఇండియాలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. హ్యాట్రిక్ డిజాస్టర్ల తర్వాత ప్రభాస్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సలార్ మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజైంది. అయితే అందులో ప్రభాస్ ను సరిగా చూపించకపోవడంపై అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

ఈ సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తోంది. హోంబలె ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించింది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరి రావు, జగపతి బాబులాంటి వాళ్లు కూడా నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ స్టైల్ మూవీ మేకింగ్ ను ఐమ్యాక్స్ ఫ్యార్మాట్లో చూడటానికి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ ట్రైలర్‌ను మరో రెండు వారాల్లో రిలీజ్ చేయాలని ఆ చిత్ర యూనిట్ నిర్ణయించింది. ట్రైలర్ ఎలా ఉండాలన్న దానిపై కూడా ఇప్పటికే డిసైడ్ అయిందని సమాచారం. టీజర్ లాగానే.. ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ ట్రైలర్‌లో కూడా యాక్షన్స్ సీక్వెన్స్‌లు, ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయని సమాచారం. ట్రైలర్‌లో యాక్షన్‍ను అధికంగా చూపించేందుకే చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. సలార్ స్టోరీ గురించి ట్రైలర్‌లో ఎక్కువగా రివీల్ చేయకూడదని డిసైడ్ చేసుకుందని సమాచారం.

ప్ర‌శాంత్ నీల్ గ‌త చిత్రాలు కేజీఎఫ్‌, కేజీఎఫ్ -2 కంటే ఎక్కువ లెంగ్త్‌తో స‌లార్ రిలీజ్ కాబోతున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు ప్ర‌భాస్ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ లెంగ్త్ మూవీగా స‌లార్ నిల‌వ‌బోతున్న‌ట్లు చెబుతోన్నారు.ప్ర‌భాస్ గ‌త సినిమా ఆదిపురుష్ రెండు గంట‌ల యాభై తొమ్మిది నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు.

ఆదిపురుష్ (Adipurush) కంటే ఒక నిమిషం ఎక్కువ లెంగ్త్‌తో స‌లార్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు తెలుస్తోంది. స‌లార్‌లో జాలి, ద‌య లాంటి గుణాలు లేని క‌రుడుగ‌ట్టిన గ్యాంగ్‌స్ట‌ర్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ప్ర‌భాస్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. అంత‌ర్లీనంగా మ‌ద‌ర్ సెంటిమెంట్ కూడా ఉంటుంద‌ని చెబుతున్నారు.