Saindhav Teaser: సైకోగా వెంకటేష్ - సైంధవ్ టీజ‌ర్ గూస్‌బంప్స్ - ఫ్యాన్స్‌కు యాక్ష‌న్ ట్రీట్‌-saindhav teaser unveiled action treat for venkatesh fans ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saindhav Teaser: సైకోగా వెంకటేష్ - సైంధవ్ టీజ‌ర్ గూస్‌బంప్స్ - ఫ్యాన్స్‌కు యాక్ష‌న్ ట్రీట్‌

Saindhav Teaser: సైకోగా వెంకటేష్ - సైంధవ్ టీజ‌ర్ గూస్‌బంప్స్ - ఫ్యాన్స్‌కు యాక్ష‌న్ ట్రీట్‌

Nelki Naresh Kumar HT Telugu
Oct 16, 2023 12:15 PM IST

Saindhav Teaser: వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ టీజ‌ర్ సోమ‌వారం రిలీజైంది. ఈ టీజ‌ర్‌లో గ‌త సినిమాల‌కు భిన్నంగా యాక్ష‌న్ రోల్‌లో వెంక‌టేష్ ప‌వ‌ర్‌ఫుల్‌గా క‌నిపిస్తోన్నారు.

వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ
వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ

Saindhav Teaser: వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ టీజ‌ర్‌ సోమ‌వారం రిలీజైంది. అదిరిపోయే యాక్ష‌న్ సీక్వెన్స్‌, విజువ‌ల్స్‌తో ఈ టీజ‌ర్ ఆస‌క్తిని పంచుతోంది. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా యాక్ష‌న్ రోల్‌లో వెంక‌టేష్ క‌నిపిస్తోన్నాడు. ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో టీజ‌ర్ ప్రారంభ‌మైంది. చంద్ర‌ప్ర‌స్థ అనే టౌన్‌లో త‌న భార్య‌, కూతురితో క‌లిసి వెంక‌టేష్ సంతోషంగా జీవిస్తున్న‌ట్లు ఈ టీజ‌ర్ లో చూపించారు.

yearly horoscope entry point

ఆ త‌ర్వాత న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీ తో కంప్లీట్ యాక్ష‌న్ మోడ్‌లోకి టీజ‌ర్ ట‌ర్న్ అయ్యింది. వికాస్ అనే క‌రుడుగుట్టిన క్రిమిన‌ల్‌గా ఈ టీజ‌ర్‌లో న‌వాజుద్ధీన్ సిద్ధిఖీని చూపించారు డైరెక్ట‌ర్‌. త‌న‌కు అడ్డొచ్చిన వారంద‌రికి దారుణంగా చంపేస్తూ న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ క‌నిపించాడు. సైకోగా వెంక‌టేష్ ఎంట్రీ టీజ‌ర్‌లో గూస్‌బంప్స్‌ను క‌లిగిస్తోంది. ఓ సారి క‌త్తి, మ‌రోసారి గ‌న్ ప‌డుతూ శ‌త్రు సంహారం చేసిన‌ట్లుగా వెంకీని ప‌వ‌ర్‌ఫుల్‌గా టీజ‌ర్‌లో ఆవిష్క‌రించారు.

వెంక‌టేష్‌పై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలుస్తోంది. వెళ్లేముందు చెప్పెళ్ల‌... విన‌లేదు. అంటే భ‌యం లేదు. లెక్క మారుద్దిరా నా కొడ‌క్క‌ల్లారా అంటూ టీజ‌ర్ చివ‌ర‌లో వెంక‌టేష్ చెప్పిన డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ టీజ‌ర్ వెంకటేష్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

చిన్న‌ పిల్ల‌ల‌కు గ‌న్ ట్రైనింగ్ ఇచ్చి టెర్ర‌రిస్ట్ ఆర్గ‌నైజేష‌న్‌కు స‌ప్లై చేసే గ్యాంగ్‌ను ఎదురించే వ్య‌క్తిగా ఈ సినిమాలో వెంక‌టేష్ క‌నిపిస్తోన్న‌ట్లుగా టీజ‌ర్ చూస్తే తెలుస్తోంది.సైంధ‌వ్ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. తొలుత డిసెంబ‌ర్ 22న సైంధ‌వ్‌ను రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు.

కానీ అదే డేట్‌కు స‌లార్ బ‌రిలో నిల‌వ‌డంతో సంక్రాంతికి వాయిదావేశారు. సైంధ‌వ్ సినిమాతో బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్ధీన్ సిద్ధికీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. శ్ర‌ద్ధాశ్రీనాథ్‌, ఆండ్రియా, రుహాణి శ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వెంక‌టేష్ హీరోగా న‌టిస్తోన్న 75వ సినిమా ఇది.

Whats_app_banner