Sailesh Kolanu on Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సీన్లు డైరెక్ట్ చేసిన సైంధవ్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా?-saindhav director sailesh kolanu shot some fillers for ram charan game changer ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sailesh Kolanu On Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సీన్లు డైరెక్ట్ చేసిన సైంధవ్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

Sailesh Kolanu on Game Changer: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సీన్లు డైరెక్ట్ చేసిన సైంధవ్ డైరెక్టర్.. ఎందుకో తెలుసా?

Hari Prasad S HT Telugu
Published Jan 10, 2024 05:53 PM IST

Sailesh Kolanu on Game Changer: సైంధవ్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీలోని కొన్ని సీన్స్ డైరెక్ట్ చేశాడని మీకు తెలుసా? అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తాజాగా అతడు వివరించాడు.

గేమ్ ఛేంజర్ మూవీ సెట్లో శంకర్, కియారా, రామ్ చరణ్
గేమ్ ఛేంజర్ మూవీ సెట్లో శంకర్, కియారా, రామ్ చరణ్

Sailesh Kolanu on Game Changer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీకి శంకర్ డైరెక్టర్. కానీ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ తాను డైరెక్ట్ చేసినట్లు సైంధవ్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను వెల్లడించాడు. టాలీవుడ్ లో హిట్, హిట్ 2 మూవీస్ తో రెండు హిట్లు అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. తన లేటెస్ట్ మూవీ గురించి చెబుతూ.. చరణ్ మూవీ గురించి కూడా వివరించాడు.

రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ ఇంకా షూటింగ్ లోనే ఉన్న విషయం తెలుసు కదా. అయితే ఈ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లు తీసే కొన్ని ఫిల్లర్స్ ను శైలేష్ కొలను డైరెక్ట్ చేయడం విశేషం. ఇలా ఎందుకు అని ప్రశ్నిస్తే.. తాను చరణ్ అన్న కోసం చేసినట్లు తెలిపాడు. ఈ సీన్లను కూడా అనుభవం ఉన్న డైరెక్టర్లతో తీయాలని డైరెక్టర్ శంకర్ చెప్పడం తనను కూడా ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలిపాడు.

దిల్ రాజు అడిగాడు.. చరణన్న కోసం చేశాను

గేమ్ ఛేంజర్ మూవీని దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలుసు కదా. అయితే ఈ సినిమాలోని బీ రోల్ షాట్లను మంచి అనుభవం ఉన్న డైరెక్టర్ తో తీయించాలని శంకర్ చెప్పడంతో ఆ పని తనను చేయమని దిల్ రాజు అడిగినట్లు శైలేష్ కొలను తెలిపాడు. "శంకర్ సర్ కాస్త బిజీగా ఉన్నాడు.

ఆ షాట్లను ఓ అనుభవం ఉన్న డైరెక్టర్ తీయాలని అడిగాడు. దీంతో దిల్ రాజు సర్ నన్ను చేయమని అడిగాడు. నేను డైరెక్ట్ చేసిన షాట్లు ఫిల్లర్లు మాత్రమే. సాధారణంగా వీటిని అసిస్టెంట్ డైరెక్టర్లు చేస్తారు. కానీ శంకర్ సర్ అనుభవజ్ఞులైన డైరెక్టర్ చేయాలని అడగడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. శంకర్ సర్ లేని సమయంలో రెండు రోజుల పాటు ఈ సినిమాపై నేను పని చేశాను.

మేజర్ సీన్లను నేను తీయలేదు. నాకు చరణ్ అన్న అంటే ఇష్టం. ఇక శంకర్ సర్ సినిమాలు చూస్తూ పెరిగాను. అందుకే ఆ షూటింగ్ కు నేను అంగీకరించాను. అసలు సినిమా దేని గురించో నాకు తెలియదు కానీ మంచి స్టోరీతో వస్తుందని మాత్రం నమ్ముతున్నాను" అని శైలేష్ కొలను తెలిపాడు.

సైంధవ్ చివరి 20 నిమిషాలు సినిమాటిక్ మాస్టర్‌పీస్

ఇక తన లేటెస్ట్ మూవీ సైంధవ్ గురించి కూడా శైలేష్ మాట్లాడాడు. ఈ మూవీలో చివరి 20 నిమిషాలు ఓ సినిమాటిక్ మాస్టర్ పీస్ అని అనడం విశేషం. "నేను ఈ సినిమా గురించి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. దీనిని నేను చాలా వినయంగా చెబుతున్నాను. సైంధవ్ మూవీలో చివరి 20 నిమిషాలు ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో చూసి అత్యుద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ లో ఒకటిగా నిలిచిపోతుంది. దీనికి కారణం వెంకటేశే" అని శైలేష్ అన్నాడు.

సైంధవ్ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న రిలీజ్ కాబోతోంది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన కూతురిని కాపాడుకోవడం కోసం మళ్లీ సైకోగా మారిన హీరో కథే సైంధవ్. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక శైలేష్ కొలను హిట్, హిట్ 2 సినిమాల నేపథ్యంలో సైంధవ్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

Whats_app_banner