Netflix OTT: ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సైఫ్ అలీఖాన్ కొడుకు - హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్ చెల్లెలు!-saif ali khan son ibrahim ali khan debut movie skips theatrical release directly streaming on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Ott: ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సైఫ్ అలీఖాన్ కొడుకు - హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్ చెల్లెలు!

Netflix OTT: ఓటీటీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్న సైఫ్ అలీఖాన్ కొడుకు - హీరోయిన్‌గా జాన్వీ క‌పూర్ చెల్లెలు!

Nelki Naresh Kumar HT Telugu
Feb 01, 2025 03:38 PM IST

Netflix OTT: బాలీవుడ్ అగ్ర న‌టుడు సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్ర‌హీం అలీఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. నాదానియ‌న్ పేరుతో ఓ బోల్డ్ ల‌వ్‌స్టోరీ చేస్తోన్నాడు. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

Netflix OTT: ఓ స్టార్ ఫ్యామిలీ నుంచి కొత్త హీరో ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే అత‌డిపై ఆడియెన్స్‌లో స్వ‌త‌హాగానే ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. టాప్ డైరెక్ట‌ర్లు, భారీ బ‌డ్జెట్ సినిమాల‌తో వార‌సుల్ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయాల‌ని స్టార్లు భావిస్తుంటారు. తొలి సినిమాతోనే హీరోగా పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో వార‌సులు రీచ్ కావాల‌ని క‌ల‌లుకంటుంటారు. కానీ సైఫ్ అలీఖాన్ త‌న‌యుడు ఇబ్ర‌హీం అలీఖాన్ మాత్రం ఓటీటీ మూవీతో హీరోగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.

yearly horoscope entry point

నాదానియ‌న్‌...

నాదానియన్ మూవీతో హీరోగా హిందీ చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు ఇబ్ర‌హీం అలీఖాన్‌. ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నాదానియన్ మూవీలో జాన్వీ క‌పూర్ సోద‌రి ఖుషి క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

నాదానియ‌న్ ఫ‌స్ట్‌లుక్‌ను నెట్‌ఫ్లిక్స్ శ‌నివారం రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్‌లో రొమాంటిక్‌గా ఇబ్ర‌హీం అలీఖాన్‌, ఖుషి క‌పూర్ క‌నిపిస్తోన్నారు. ఇబ్ర‌హీం అలీఖాన్ ఒడిలో వాలిపోయి న‌ట్లుగా ఖుషి క‌పూర్ ఉంది. నాదానియ‌న్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

నాదానియ‌న్ మూవీ త్వ‌ర‌లో ఓటీటీలోకి రాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రిలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. న్యూ ఏజ్ బోల్డ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీతో షానా గౌత‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అర్జున్‌, ప్రియ ల‌వ్ స్టోరీ...

ఈ మూవీలో అర్జున్ అనే మిడిల్‌ క్లాస్ యువ‌కుడిగా ఇబ్ర‌హీం అలీఖాన్‌ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ప్రియా అనే గొప్పింటి అమ్మాయిగా ఖుషి క‌పూర్ న‌టిస్తోన్న‌ట్లు చెబుతోన్నారు.

భిన్న మ‌న‌స్త‌త్వాలు, అంత‌స్తుల‌కు చెందిన ఈ జంట ఎలా ప్రేమ‌లో ప‌డ్డారు? అపోహ‌లు, అభిప్రాయ‌భేదాల‌తో వారి ప్రేమ ప్ర‌యాణం ఎలా సాగింద‌న్న‌ది రొమాంటిక్ అంశాల‌తో డైరెక్ట‌ర్ ఈ మూవీలో చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. నాదానియ‌న్ సినిమాను క‌ర‌ణ్ జోహార్ ప్రొడ్యూస్ చేస్తోన్నాడు.

ల‌వ్ టుడే రీమేక్‌లో…

గ‌త ఏడాది రిలీజైన ది ఆర్చీస్ వెబ్‌సిరీస్‌తో ద్వారా యాక్ట‌ర్‌గా మారింది ఖుషి క‌పూర్‌. ప్ర‌స్తుతం ల‌వ్ పాయా పేరుతో ఓ మూవీ చేస్తోంది. త‌మిళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ల‌వ్ టుడే మూవీకి రీమేక్‌గా ల‌వ్ పాయా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో ఆమిర్‌ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా న‌టిస్తోన్నాడు.

Whats_app_banner