OTT Action Thriller: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న యాక్షన్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్-saif ali khan nikita dutta jaadu song out from jewel thief this action thriller will be streaming on netflix ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Action Thriller: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న యాక్షన్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

OTT Action Thriller: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న యాక్షన్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

Jewel Thief - Jaadu song: జువెల్ తీఫ్ సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ అయింది. సైఫ్ అలీ ఖాన్, నిఖితా దత్తా స్టెప్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

OTT Action Thriller: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రానున్న యాక్షన్ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన ‘జువెల్ తీఫ్’ చిత్రంపై బజ్ బాగా ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ మూవీకి కూకీ గులాటీ, రాబీ గెర్వాల్ దర్శకత్వం వహించారు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమా క్యూరియాసిటీని పెంచింది. స్ట్రీమింగ్ డేట్ దగ్గర పడుతుండగా.. జువెల్ తీఫ్ నుంచి పాటను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 9) తీసుకొచ్చింది.

క్యాచీ బీట్‍తో..

జాదూ అంటూ జువెల్ తీఫ్ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది. లిరికల్ వీడియోను యూట్యూబ్‍లో మూవీ టీమ్ రిలీజ్ చేసింది. క్యాచీ బీట్‍తో మంచి ఎనర్జీతో ఈ సాంగ్ ఉంది. సైఫ్ అలీ ఖాన్, నిఖితా దత్తా స్టెప్‍లు, కెమిస్ట్రీ ఆకట్టుకుంది. జైదీప్ అహ్లవత్ కూడా ఈ పాటలో చిందేశారు.

జూదూ పాటకు సవేపా, ఓఏఎఫ్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాటను రాఘవ్ చైతన్య పాడారు. కుమార్ లిరిక్స్ అందించారు. పియూష్, షాజియా డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సాంగ్ మంచి బీట్‍తో ఆకట్టుకునేలా ఉంది.

ఆఫ్రికన్ రెడ్ సన్ డైమండ్ అనే విలువైన వజ్రం చోరీ చేసే మిషన్ చుట్టూ జువెల్ తీఫ్ చిత్రం సాగుతుంది. ఈ మూవీని హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్లు కూకీ గులాటీ, రాబీ. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, జైదీప్, నిఖితాతో పాటు కృణాల్ కపూర్, కుల్‍భూషణ్ కర్బంద కీరోల్స్ చేశారు.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

జువెల్ తీఫ్ చిత్రం ఈనెల ఏప్రిల్ 25వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీలో రూపొందిన ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

జువెల్ తీఫ్ చిత్రాన్ని మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ ప్రొడ్యూజ్ చేశారు. ముంబై, బుదాపెస్ట్, ఇస్తాంబుల్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది. మంచి బడ్జెట్‍తోనూ ఈ చిత్రం రూపొందింది.

ఈవారం నెట్‍ఫ్లిక్స్‌లో ‘కోర్ట్’

కోర్ట్ సినిమా ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తెలుగు లీగల్ డ్రామా చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 14న థియేటర్లలో విడుదలైన కోర్ట్ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ లోబడ్జెట్ చిత్రం రూ.57కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ మూవీకి రామ్ జగదీశ్ దర్శకత్వం వహించారు. నేచులర్ స్టార్ నాని ప్రొడ్యూజ్ చేశారు. కోర్ట్ చిత్రాన్ని ఈ శుక్రవారం ఏప్రిల్ 11 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం