బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన జువెల్ తీఫ్ సినిమా మంచి అంచనాలతో వచ్చింది. థియేటర్లలో కాకుండా నేరుగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తుండటంతో మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఈ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. జువెల్ తీఫ్ జైదీప్ అహ్లావత్, నిఖితా దత్తా కూడా ముఖ్యమైన రోల్స్ చేశారు. ఈ జువెల్ తీఫ్ చిత్రం ట్రెండింగ్‍లో ఎట్టకేలకు టాప్‍కు వచ్చింది.
జువెల్ తీఫ్ చిత్రం ఏప్రిల్ 25న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, ఇంగ్లిష్ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా నెట్‍ఫ్లిక్స్‌లోకి ఈ చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలోకి వచ్చిన రెండు రోజుల్లో ఈ మూవీ సినిమా ట్రెండింగ్ జాబితాలో టాప్ ప్లేస్‍కు వచ్చింది. ప్రస్తుతం (ఏప్రిల్ 27) ఫస్ట్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
జువెల్ తీఫ్ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు రావడంతో వ్యూస్ బాగానే దక్కుతున్నాయి. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‍లో ఇప్పటికీ టాప్‍కు వచ్చింది. కానీ ఈ సినిమాకు ఎక్కువగా నెగెటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఏ మాత్రం థ్రిల్లింగ్‍గా లేదని, ఊహాలకు అందేలా ఉంటూ సాగదీతగా అనిపించిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దోపిడీ చేసే సీన్లు కూడా ఆసక్తికరంగా లేవని రాసుకొస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్లు కూడా ఏ మాత్రం వర్కౌట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు.
జువెల్ తీఫ్ నిరాశపరిచిందని, అంచనాలను అసలు అందుకోలేకోపోయిందని కొందరు కామెంట్లు చేశారు. సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ మెప్పించేలా ఉందని కొందరు అంటున్నారు. ఈ మూవీని ఆసక్తికరంగా నడపడంలో డైరెక్టర్లు విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చిన టాక్ నెగెటివ్‍గా ఉండటంతో ఆ ప్లేస్‍లో ఈ చిత్రం ఎన్ని రోజులు ఉండగలదో చూడాలి.
ఆఫ్రికన్ రెడ్ సన్ అనే విలువైన డైమండ్ చోరీ చుట్టూ జువెల్ తీఫ్ చిత్రం సాగుతుంది. జువెల్ తీఫ్ సినిమాలో సైఫ్, జైదీప్, నిఖితతో పాటు కనాల్ కపూర్, కుల్‍భూషణ్ కర్బంద, గగన్ అరోరా కీరోల్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయారు డైరెక్టర్లు కూకీ, రాబీ. ఈ చిత్రాన్ని మ్యాట్రిక్స్ పిక్చర్స్ పతాకంపై సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ ప్రొడ్యూజ్ చేశారు.
నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఏప్రిల్ 25నే తెలుగు కామెడీ మూవీ మ్యాడ్ స్క్వేర్ స్ట్రీమింగ్‍కు వచ్చింది. సంతోష్ శోభన్, రామ్ నితిన్, నార్నే నితిన్, విష్ణు ఓయ్ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది.
సంబంధిత కథనం