‘జువెల్ తీఫ్ - ది హీస్ట్ బిగిన్స్’ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేసిన ఈ హీస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం థియేటర్లలో కాకుండా ఓటీటీలోకి డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. విలువైన వజ్రం చోరీ చుట్టూ ఈ మూవీ సాగుతుంది. స్ట్రీమింగ్‍కు వచ్చాక ఈ మూవీకి ఎక్కువ శాతం నెగెటివ్ టాక్ వచ్చింది. కానీ వ్యూస్‍లో మాత్రం జువెల్ తీఫ్ అదరగొట్టింది.
జువెల్ తీఫ్ మూవీ నెగెటివ్ రెస్పాన్స్ దాటుకొని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంది. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో అందుబాటులోకి వచ్చింది. సైఫ్ లాంటి స్టార్ ఉండడం, ఐదు భాషల్లో నేరుగా ఓటీటీలోకే రావడం, ఈ మూవీ ఆరంభం నుంచి సత్తాచాటింది.
జువెల్ తీఫ్ చిత్రం మొదటి నుంచి మంచి వ్యూస్ దక్కించుకుంది. కొన్ని వారాల పాటు టాప్‍లో ట్రెండ్ అయింది. ఈ సినిమా రెండు వారాల్లోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో 16.1 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. దీంతో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ఈ ఏడాది 2025లో ఇప్పటి వరకు ఎక్కువ మంది చూసిన చిత్రంగా జువెల్ తీఫ్ నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల టాప్-5లో ట్రెండ్ అవుతోంది.
జువెల్ తీఫ్ చిత్రంలో ఓ బడా దొంగ పాత్ర చేశారు సైఫ్ అలీ ఖాన్. రూ.500కోట్ల విలువైన ఆఫ్రికన్ రెడ్ సన్ వజ్రం దోపిడీ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. ఈ చిత్రంలో జైదీప్ అహ్లావత్ కూడా మరో ముఖ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాకు కూకీ గులాటీ, రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు.
జువెల్ తీఫ్ సినిమాకు స్ట్రీమింగ్ తర్వాత నెగెటివ్ రెస్పాన్స్, రివ్యూలు వచ్చాయి. స్టోరీ రొటీన్‍గా ఉందని, నరేషన్ ఫ్లాట్‍గా ఉందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో ఈ చిత్రం జోరు చూపిస్తుందా అనే సందేహాలు వచ్చాయి. అయితే, వ్యూస్‍లో మాత్రం ఈ మూవీ అదరగొట్టింది.
జువెల్ తీఫ్ మూవీలో సైఫ్ అలీ ఖాన్, జైదీప్‍తో పాటు నిఖితా దత్తా, కునాల్ కపూర్, కుల్‍భూషణ్ కర్బంద కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని మార్‌ఫ్లిక్స్ పతాకంపై సిద్ధార్థ్ ఆనంద్, మమత ఆనంద్ ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం