Devara Bhaira Glimpse: దేవర సినిమా నుంచి ‘భైర’ గ్లింప్స్ వచ్చేసింది.. పవర్‌ఫుల్‍గా..: చూసేయండి
Devara Bhaira Glimpse: దేవర సినిమా నుంచి బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ గ్లింప్స్ వచ్చేసింది. భైర గ్లింప్స్ పేరుతో ఈ వీడియో రిలీజ్ అయింది. సైఫ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ గ్లింప్స్ తీసుకొచ్చింది మూవీ టీమ్. ఇంటెన్స్‌గా ఈ గ్లింప్స్ ఉంది.
దేవర సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. దేవరతోనే టాలీవుడ్‍లోకి సైఫ్ ఎంట్రీ ఇస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో 'భైర' పాత్ర చేస్తున్నారు. నేడు (ఆగస్టు 16) సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు కావటంతో గ్లింప్స్ రిలీజ్ చేసింది దేవర మూవీ టీమ్. భైర గ్లింప్స్ అంటూ ఓ వీడియో తీసుకొచ్చింది.
గ్లింప్స్ ఇలా..
దేవర నుంచి వచ్చిన భైర గ్లింప్స్ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్‍గా ఉంది. మల్లయోధుడిగా సైఫ్ అలీ ఖాన్ పవర్‌ఫుల్‍గా, భీకరంగా కనిపించారు. ముందుగా ఆ ప్రాంతమంతా భైర (సైఫ్ అలీఖాన్) కనుసన్నల్లోనే ఉంటుందనేలా మేకర్స్ ఈ గ్లింప్స్‌లో చూపించారు. అక్కడి వారు భైర.. భైర అని అరుస్తుండగా.. అతడు మల్లయుద్ధానికి దిగుతాడు. పోటీకి వారిని మట్టికరిపిస్తాడు. అతడికి ఓ సైన్యమే ఉంటుందని ఈ గ్లింప్స్‌లో అర్థమవుతోంది.
మొత్తంగా దేవరలో సైఫ్ అలీ ఖాన్ బలమైన విలన్‍గా ఉంటాడనేది అర్థమవుతోంది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. విలన్ ఎంత పటిష్టంగా ఉంటే.. హీరో అంత ఎలివేట్ అవుతాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్లింప్స్‌కు అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ఇంటెన్సిటీ మరింత ఎలివేట్ అయింది.
తుదిదశకు షూటింగ్
దేవర సినిమా షూటింగ్ తుది దశకు చేరింది. హీరో ఎన్టీఆర్ ఇప్పటికే తన పార్ట్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల వెల్లడించారు. మిగిలిన కాస్త షూటింగ్‍ను త్వరగా ఫినిష్ చేయాలని డైరెక్టర్ కొరటాల శివ భావిస్తున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన దేవర మూవీ రిలీజ్ కానుంది. మరో వారంలోనే షూటింగ్ కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
గ్లోబల్ సెన్సేషనల్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం కావటంతో పాన్ ఇండియా రేంజ్‍లో దేవరకు ఫుల్ క్రేజ్ ఉంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఈ మూవీతోనే తెలుగులో అడుగుపెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్‍తో పాటు బాలీవుడ్ మరో స్టార్ బాబీ డియోల్ కూడా ఈ చిత్రంలో విలన్‍గా చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శృతి మరాథే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయారాసన్, మురళీ శర్మ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
దేవర సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు సూపర్ పాపులర్ అయ్యాయి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మొదటి పాటగా వచ్చిన ఫియర్ సాంగ్ దుమ్మురేపింది. ఈ పాట మార్మోగిపోతోంది. ఇటీవలే దేవర నుంచి చుట్టమల్లే అంటూ రెండో సాంగ్ వచ్చింది. ఈ రొమాంటిక్ మెలోడీ పాటకు అందరూ ఫిదా అయిపోయారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ, అనిరుధ్ మెలోడీ ట్యూన్ అదిరిపోయాయి.
దేవర సినిమా నుంచి తదుపరి ఆయుధపూజ సాంగ్ రానుంది. ఈనెలాఖరులో లేకపోతే సెప్టెంబర్ ప్రారంభంలో ఈ పాటను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ పవర్‌ఫుల్‍గా ఉంటుందని తెలుస్తోంది. దేవర చిత్రం సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.