Sai Pallavi: ఆ వయసులోనే లవ్‌ లెటర్‌.. పేరెంట్స్‌ కొట్టారంటున్న సాయిపల్లవి-sai pallavi reveals her parents beat her for writing a love letter to a boy ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Pallavi Reveals Her Parents Beat Her For Writing A Love Letter To A Boy

Sai Pallavi: ఆ వయసులోనే లవ్‌ లెటర్‌.. పేరెంట్స్‌ కొట్టారంటున్న సాయిపల్లవి

HT Telugu Desk HT Telugu
Jul 11, 2022 12:21 PM IST

Sai Pallavi: విరాట పర్వంలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్న సాయి పల్లవి.. తన వ్యక్తిగత జీవితం గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం చెప్పింది. తన పేరెంట్స్‌ తనను కొట్టారని ఆమె చెప్పడం విశేషం.

విరాట పర్వం మూవీలో రానా, సాయి పల్లవి
విరాట పర్వం మూవీలో రానా, సాయి పల్లవి (Twitter)

సాయి పల్లవి.. తెలుగులో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న నటి. తాజాగా విరాటపర్వంతో నటనలో మరో లెవల్‌కు వెళ్లింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర పెద్దగా సక్సెస్‌ కాకపోయినా.. క్రిటిక్స్‌ నుంచి పాజిటివ్‌ రివ్యూలు వచ్చాయి. ఇప్పుడామె తన నెక్ట్స్‌ మూవీ గార్గి రిలీజ్‌ కోసం చూస్తోంది. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడిన ఆమె.. తన పర్సనల్ లైఫ్‌ గురించి మాట్లాడింది.

తాను స్కూల్లో ఉన్నప్పుడు తన క్లాస్‌మేట్‌కు లవ్‌ లెటర్‌ రాశానని, అది చూసి తన పేరెంట్స్‌ తనను కొట్టారని సాయిపల్లవి ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అప్పట్లో టీనేజ్‌లో ఉన్న ఆమె.. తన జీవితంలో తాను రాసిన లెటర్‌ అదొక్కటే అని చెప్పడం విశేషం. విరాట పర్వం మూవీలో హీరో తల్లి చెబుతుంటే ఆమె లెటర్‌ రాసిన సీన్‌ ఒకటి ఉంటుంది.

దీని గురించి అడిగినప్పుడు సాయిపల్లవి తన నిజ జీవితంలో జరిగిన ఈ ఘటన గురించి షేర్‌ చేసుకుంది. "నా జీవితంలో ఒకేసారి లెటర్‌ రాశాను. అది కూడా ఓ అబ్బాయికి. అది నా చిన్నతనంలో. ఏడో తరగతిలో కావచ్చు. కానీ నన్ను నా పేరెంట్స్‌ పట్టుకున్నారు. చాలా కొట్టారు. ఆ తర్వాత మళ్లీ లెటర్‌ రాయలేదు" అని సాయిపల్లవి చెప్పింది.

అటు ఈ మూవీలో నటించిన హీరో రానాకు కూడా ఈ లెటర్‌ రాయడం గురించి అడిగితే.. తాను కూడా జీవితంలో ఒకేసారి లెటర్‌ రాశానని, అది తన తాత రామానాయుడుకి అని చెప్పాడు. తన చిన్నతనంలో తన తాత కారంచేడులో ఉన్నప్పుడు ఆ లేఖ రాసినట్లు తెలిపాడు. గత నెల 17న థియేటర్లలో రిలీజైన విరాట పర్వం.. ఈ నెల 1న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే.

IPL_Entry_Point

సంబంధిత కథనం