Sai Pallavi: నెట్‌ఫ్లిక్స్‌లో విరాటపర్వం.. ఫ్యాన్స్‌కు సాయిపల్లవి స్పెషల్ రిక్వెస్ట్‌-sai pallavi request fans to watch virata pravam in netflix streaming from today that is july 1st ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Pallavi Request Fans To Watch Virata Pravam In Netflix Streaming From Today That Is July 1st

Sai Pallavi: నెట్‌ఫ్లిక్స్‌లో విరాటపర్వం.. ఫ్యాన్స్‌కు సాయిపల్లవి స్పెషల్ రిక్వెస్ట్‌

HT Telugu Desk HT Telugu
Jul 01, 2022 10:08 AM IST

Sai Pallavi: తెలుగునాట లేడీ సూపర్‌స్టార్‌గా ఎదుగుతున్న నటి సాయిపల్లవి. ఆమె నటించిన లేటెస్ట్‌ మూవీ విరాటపర్వం. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన సందర్భంగా ఆమె ఫ్యాన్స్‌కు ఇన్‌స్టా ద్వారా స్పెషల్‌ రిక్వెస్ట్‌ చేసింది.

విరాట పర్వం మూవీలో సాయి పల్లవి
విరాట పర్వం మూవీలో సాయి పల్లవి (Saipallavi Instagram)

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి విరాట్‌పర్వం మూవీ వచ్చేసింది. శుక్రవారమే (జులై 1) ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. గత నెల 17న రిలీజైన ఈ మూవీ ఊహించినదాని కంటే చాలా త్వరగానే ఓటీటీలోకి రావడం విశేషం. సాయిపల్లవి, రానా నటించిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

తెలంగాణలో 1990లనాటి నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఇప్పటి యూత్‌కు పెద్దగా ఎక్కినట్లు లేదు. అన్నల్లో చేరాలనుకొని వచ్చి, వాళ్ల చేతుల్లోనే బలైన తూము సరళ అనే నిజ జీవిత పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఆమె పాత్రలో సాయి పల్లవి నటించింది. ఈ సినిమాలో ఈ క్యారెక్టర్‌ పేరు వెన్నెల.

విరాట పర్వంతో తన నటనలోని మరో కోణాన్ని ఆమె చూపించింది. ఇప్పుడీ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులకు ఓ రిక్వెస్ట్‌ చేసింది. విరాటపర్వంలో తాను పోషించిన వెన్నెల పాత్ర తాను పోషించిన అత్యంత చిరస్మరణీయమైన పాత్రల్లో ఒకటని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోందని, ప్రతి ఒక్కరూ ఆమె ప్రయాణాన్ని చూడాలని సాయిపల్లవి కోరింది.

ఈ సందర్భంగా విరాట పర్వం సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలను ఆమె పంచుకుంది. అందులో కొన్ని షూటింగ్‌ స్పాట్‌కు సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ సినిమా చేసే అవకాశం తనకు ఇచ్చిన మూవీ యూనిట్‌ అందరికీ సాయిపల్లవి థ్యాంక్స్‌ చెప్పింది. వేణు ఊడుగుల ఈ సినిమాకు డైరెక్టర్‌. వెన్నెల పాత్రను ప్రేక్షకులకు దగ్గర చేయడంలో అతడు సక్సెసయ్యాడని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.