Sai Pallavi: విరాటపర్వం రిజల్ట్ పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్....-sai pallavi reacts on virata parvam result ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Pallavi Reacts On Virata Parvam Result

Sai Pallavi: విరాటపర్వం రిజల్ట్ పై సాయిపల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్....

Nelki Naresh Kumar HT Telugu
Jul 11, 2022 02:37 PM IST

సాయిపల్లవి(sai pallavi), రానా (rana) ప్రధాన పాత్రల్లో నటించిన విరాటపర్వం(virataparvam) చిత్రం గత నెలలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ కు ప్రేమకథను జోడించి తెరకెక్కించినసినిమాకు ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ కాలేదు. ఈ సినిమా ఫలితంపై గార్గి ప్రమోషన్స్ లో సాయిపల్లవి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె ఏమన్నదంటే...

సాయిపల్లవి
సాయిపల్లవి (twitter)

విరాటపర్వం సినిమాలో వెన్నెల గా అసమాన నటనను కనబరిచింది సాయిపల్లవి. అరణ్య అనే నక్సల్ నాయకుడి భావజాలం పట్ల ఆకర్షితురాలై అతడి ప్రేమ కోసం అడవి దారి పట్టిన యువతి పాత్రలో చక్కటి ఎమోషన్స్ తో విమర్శలకు ప్రశంసలను అందుకున్నది. మంచి సినిమాగా పేరొచ్చిన కమర్షియల్ గా మాత్రం ఈ సినిమా వర్కవుట్ కాలేదు. నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా రిజల్ట్ పై గార్గి ప్రమోషన్స్ లో సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

బాక్సాఫీస్ ఫలితంతో సంబంధం లేకుండా నటిగా విరాటపర్వం తనకు సంతృప్తిని మిగిల్చిందని పేర్కొన్నది. ప్రేమ, కోపం, దు:ఖం అన్ని రకాల ఎమోషన్స్ పండించే పాత్రలు అరుదుగా దొరకుతాయని సాయిపల్లవి అన్నది. ఆ అవకాశం విరాటపర్వం సినిమాతో తనకు దక్కిందని తెలిపింది. గతంలో తాను చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా వెన్నెల పాత్ర సాగిందని చెప్పింది. నటిగా తనకు కొత్తదనాన్ని ప్రదర్శించే అవకాశం ఈ క్యారెక్టర్ తో దొరికిందని పేర్కొన్నది. సినిమాల్ని అంగీకరించే ముందు తాను ఎలాంటి ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకోనని చెప్పింది. విరాటపర్వం సినిమాను అలాగే అంగీకరించానని తెలిపింది.

తన ఇంట్లో నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారని, ఒక్కొక్కరు ఒక్కో జోనర్ సినిమాల్ని ఇష్టపడతారని, అలాగే ప్రేక్షకుల అభిరుచుల్లో తేడాలు ఉంటాయని సాయిపల్లవి అన్నది. ప్రేక్షకుల ఆలోచనల్ని అందుకోవడం సాధ్యం కాదని చెప్పింది. సినిమా చేయడం వరకు తన బాధ్యతగా భావిస్తానని, హార్డ్ వర్క్, నటనతో ఆడియోన్స్ కు మంచి క్యారెక్టర్ ఇవ్వడానికే ప్రతిసారి ప్రయత్నిస్తానని తెలిపింది. విరాటపర్వం సినిమాకు అలాగే కష్టపడ్డానని చెప్పింది. కానీ కమర్షియల్ గా సినిమా ఆడుతుందా లేదా ప్రేక్షకుల చేతిలో ఉంటుందని తెలిపింది. ఫలితాన్ని వారే డిసైడ్ చేస్తారని అన్నది. ఫలితంతో సంబంధం లేకుండా నటిగా విరాటపర్వం చక్కటి సంతృప్తిని మిగిల్చిందని చెప్పింది.

లవ్ స్టోరి, శ్యామ్ సింగరాయ్, విరాటపర్వం వరుసగా బరువైన పాత్రలే చేయాల్సివస్తుందని సాయిపల్లవి పేర్కొన్నది. నటిగా తనపై ఒత్తిడి పెరిగిపోయి డిప్రెస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుందని అన్నది. మంచి కామెడీ కథ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. కిల్ బిల్ లాంటి యాక్షన్ సినిమా చేయాలన్నది తన కల అని పేర్కొన్నది. సాయిపల్లవి నటించిన గార్గి సినిమా జూలై 15న విడుదలకానుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్