Gargi: 'ఒక్క రోజులో జీవితం తలకిందులైతే'.. సాయి పల్లవి 'గార్గి' ట్రైలర్ విడుదల-sai pallavi new movie gargi trailer released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sai Pallavi New Movie Gargi Trailer Released

Gargi: 'ఒక్క రోజులో జీవితం తలకిందులైతే'.. సాయి పల్లవి 'గార్గి' ట్రైలర్ విడుదల

Maragani Govardhan HT Telugu
Jul 07, 2022 07:47 PM IST

సాయి పల్లవి నటించిన తాజా చిత్రం గార్గి. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు నేచురల్ స్టార్ నాని. న్యాయ వ్యవస్థతో పోరాడో యువతి పాత్రలో నటించింది సాయి పల్లవి. ఈ సినిమా జులై 15న విడుదల కానుంది.

గార్గి ట్రైలర్ విడుదల
గార్గి ట్రైలర్ విడుదల (Twitter)

ఇటీవల విరాట పర్వం లాంటి సీరియస్ సినిమాలో నటించిన సాయి పల్లవి.. మరోసారి అలాంటి తరహా చిత్రంతోనే రానుంది. కాకపోతే ఈ రెండు చిత్రాలక కథ, కథాంశం పూర్తిగా విభిన్నం. అదే గార్గి. న్యాయం కోసం పోరాడే యువతి పాత్రలో కనిపించింది సాయి పల్లవి. ఈ చిత్రం ఈ నెల 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని, రానా రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే ఈ సినిమా న్యాయ వ్యవస్థ చుట్టూ తిరిగే సన్నివేశాలతో ఆసక్తిగా సాగింది. ముఖ్యంగా ట్రైలర్‌ను పరిశీలిస్తే కోర్టు రూమ్ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీచర్‌గా పనిచేసే ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి తండ్రిని పోలీసులు అరెస్టు చేస్తారు. తన తండ్రిని కాపాడుకునేందుకు పోలీసులు, న్యాయ వ్యవస్థ, మీడియా, సమాజాన్ని ఆ యువతి ఎలా ఎదుర్కొంది అనేది ప్రధాన కథాంశంగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

ప్రచార చిత్రంలో వినిపించిన డైలాగులు ఆసక్తికరంగా, ఆలోజింపజేసేలా ఉన్నాయి. సాయి పల్లవి తన నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడిసేలా ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో రానా సమర్పిస్తున్నారు. ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను హీరో సూర్య, ఆర్య, అనిరుధ్, లోకేశ్ కనగరాజ్‌లు విడుదల చేశారు. సోషల్ మీడియా వేదికగా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన తర్వాత వారంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

గౌతమ్ రామచంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా విడుదల కానుంది. మరోసారి సీరియస్ కథాంశంతో రానున్న సాయి పల్లవి.. తన నటనతో ఆకట్టుకోనుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్