Sai Pallavi Dance: చెల్లెలి పెళ్లిలో మైమరచిపోయి డ్యాన్స్ చేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్
Sai Pallavi Dance: తన చెల్లెలి పెళ్లిలో సాయి పల్లవి మైమరచిపోయి డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆమె చెల్లెలు పూజా కన్నన్ గురువారం (సెప్టెంబర్ 5) పెళ్లి చేసుకుంది.
Sai Pallavi Dance: టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి ఎంత మంచి డ్యాన్సరో తెలుసు కదా? నటనతోపాటు తన డ్యాన్స్ లతోనూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె.. తాజాగా మరోసారి సిల్వర్ స్క్రీన్ బయట కూడా మరోసారి డ్యాన్స్ తో అదరగొట్టింది. తన చెల్లెలు, నటి పూజా కన్నన్ పెళ్లిలో సాయి పల్లవి మైమరచిపోయి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాయి పల్లవి డ్యాన్స్
సాయి పల్లవి తన చెల్లెలు ప్రీవెడ్డింగ్ ఈవెంట్లలో డ్యాన్స్ చేసింది. కంగనా రనౌత్ నటించిన క్వీన్ మూవీలోని లండన్ తుమక్డా పాటపై ఆమె ఆ ఈవెంట్లోని మరికొంత మందితో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. ఈ వీడియోను ఓ రెడిట్ యూజర్ షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది.
బ్లూ, బీజ్ కలర్ సాంప్రదాయ దుస్తుల్లో సాయి పల్లవి మెరిసిపోయింది. సంగీత్ సెర్మనీలో ఆమె మైమరచిపోయి స్టెప్పులేసింది. ఈ ఫిదా నటి డ్యాన్స్ లో మామూలుగానే ఇరగదీస్తుందన్న సంగతి తెలుసు కదా. సినిమాల్లోకి రాక ముందు ఢీ షోలో డ్యాన్స్ తోనే అభిమానులను సంపాదించుకుంది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి చాలా మంది అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపించారు. తన చెల్లెలితోనూ కలిసి చేసిన డ్యాన్స్ కూడా చాలా బాగుందని కామెంట్స్ చేశారు. రౌడీ బేబీ చాలా క్యూట్ గా కనిపించిందని ఓ యూజర్ కామెంట్ చేయడం విశేషం.
పూజా కన్నన్ పెళ్లి గురించి..
సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్.. వినీత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్ల పెళ్లి తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా జరిగింది. ఆమె పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఈ పెళ్లికి సాయి పల్లవి కూడా తెల్ల చీరలో ఎంతో అందంగా ముస్తాబైంది. ఈ ఏడాది జనవరిలో పూజా, వినీత్ నిశ్చితార్థం జరిగింది. అప్పుడు కూడా సాయి పల్లవి ఇలాగే చెలరేగిపోయి డ్యాన్స్ చేసింది.
సాయి పల్లవి మూవీస్
సాయి పల్లవి చివరిగా 2022లో వచ్చి గార్గి మూవీలో నటించింది. గతేడాది ఆమె నటించిన ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ఇప్పుడు నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాలో నటిస్తోంది. దీంతోపాటు అమరన్ అనే తమిళ మూవీ కూడా ఈ ఏడాదే రానుంది. ఇవే కాకుండా హిందీలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న రామాయణం సినిమాలో సాయి పల్లవి సీతగా నటిస్తోంది.